యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'చెంచల'. ఈ సినిమాలో ఓ ప్రముఖ కథానాయిక కనిపించబోతున్నారు. తాజాగా విజయ దశమి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీకి జగదీష్ అచార్ దర్శకత్వం వహిస్తుండగా.. కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్, సుజిత్ శెట్టిలు సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఏఎన్ బాలాజీ నిర్మిస్తున్నారు.
'చెంచల' మూవీ కూర్గ్ ప్రాంతంలో పాము చుట్టూ జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ చెంచల పాత్రకు, ఓ పాముకు మధ్య సాగుతుంది. చెంచల కుటుంబం ఎలా హత్యకు గురైంది? తన గతం ఏంటి? పాముతో తనకున్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాత ఏఎన్ బాలాజీ తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున నిర్మిస్తున్నామని.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారభిస్తామని ఆయన ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment