విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి, విస్మయ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం నమో. శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
విశ్వంత్- అనురూప్ కాంబోలో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ పోస్టర్, టీజర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూన్ 7న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా రాహుల్ శ్రీవాత్సవ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా క్రాంతి ఆచార్య వడ్లూరి.. ఎడిటర్‌గా సనల్ అనిరుధన్ పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment