రిలీజ్‌కు సిద్ధమైన పరాక్రమం మూవీ.. డేట్‌ ఫిక్స్! | Tollywood Hero Bandi Saroj Kumar latest Movie Release Date Locked | Sakshi
Sakshi News home page

Parakramam Release Date: చిరంజీవి బర్త్‌ డేకు పరాక్రమం.. రిలీజ్‌ టీజర్‌ చూశారా?

Published Tue, Jul 23 2024 9:01 PM | Last Updated on Tue, Jul 23 2024 9:01 PM

Tollywood Hero Bandi Saroj Kumar latest Movie Release Date Locked

బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "పరాక్రమం". ఈ చిత్రాన్ని బీఎస్‌కే మెయిన్‌స్ట్రీమ్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మూవీ రిలీజ్ అనౌన్స్‌మెంట్ టీజర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ..'మా పరాక్రమం సినిమాను చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేస్తున్నాం. పరాక్రమం విషయానికి వస్తే ఇదొక సంఘర్షణతో కూడుకున్న కథ. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చా. నేను గతంలో నిర్భందం , నిర్భందం 2 , మాంగళ్యం సినిమాలను రూపొందించా. ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు  మాత్రం నా స్టైల్ మార్చాలని ఫిక్స్ అయ్యా. అలా మార్చి చేసిన సినిమానే పరాక్రమం. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement