
Macherla Niyojakavargam Movie Teaser And Release Date Released: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఎమ్‌ఎస్. రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నితిన్‌కు జోడిగా కృతిశెట్టి నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి నితిన్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ టీజర్‌తోపాటు సినిమా విడుదల తేదిని కూడా ప్రకటించారు మూవీ మేకర్స్. మాచర్ల నియోజకవర్గం సినిమాను ఫస్ట్ ఎటాక్ అంటూ టీజర్ లాంచ్ చేసి, ప్రపంచవ్యాప్తంగా జూలై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు.
మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు టీజర్ రిలీజ్‌తోపాటు సినిమా విడుదల తేదిని ప్రకటించి గిఫ్ట్‌గా ఇచ్చారు మేకర్స్. మాచర్ల నియోజకవర్గంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో అలరించనున్నాడు నితిన్. ఈ పాత్రలో నితిన్ చాలా అద్భుతంగా ఉన్నాడు. పూర్తిస్తాయి మీసాలు, కత్తిరించిన గడ్డం గెటప్‌తో మాస్‌గా అట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ టీజర్‌లో విలన్లు నితిన్‌పై ఎటాక్ చేసే యాక్షన్ సీన్ చూపించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను వెంకట్ మాస్టర్ తెరకెక్కించారు. రాజకీయ నేపథ్యంతో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది. ఇందులో నితిన్‌ను మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో చూడనున్నట్లు తెలుస్తోంది.