హీరో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె విడుదల చేసిన మూవీ ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు(బుధవారం) ఈ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. ‘అల్లంత దూరంగా నువ్వు .. నీ కన్ను నన్నే చూస్తుంటే’ అంటూ ఈ పాట సాగే పాటలో హీరోహీరోయిన్ మధ్య ప్రేమ, అల్లరిని చూపించారు.
దీంతో ఈ పాట యూత్ బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, చైత్ర, అభయ్ ఆలపించారు. కాగా ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment