
పెళ్లి చేసుకోవాలి... చంపాలి!
అతను చాలా స్మార్ట్ అండ్ సింపుల్...పెద్ద పెద్ద కళ్లద్దాలు పెట్టుకుని పక్కింటి అబ్బాయిలా.. చెప్పాలంటే పక్కా జెంటిల్‌మన్‌లా ఉంటాడు.. పైకి మంచిగా కనిపించే ఈ కుర్రాడికి ఓ లక్ష్యం ఉంటుంది. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఆమెను తెలివిగా చంపాలి? ఇంతకీ ఆమె ఎవరు...? ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు ఈ కుర్రాడు ఈ కథకు హీరోనా... విలనా...? అని ట్రైలర్ ద్వారా ‘జెంటిల్‌మన్’ సినిమాలోని నాని పాత్రకు నెగటివ్ టచ్ కూడా ఉందని చూపించేశారు ఇంద్రగంటి మోహనకృష్ణ.
ఆయన దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని, నివేదా థామస్, సురభి ముఖ్య తారలుగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా ఈ చిత్రం సాగుతుంది. మణిశర్మ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్.