నవ్వులతో దోచుకుంటాం | Allari Naresh Joins January Race | Sakshi
Sakshi News home page

నవ్వులతో దోచుకుంటాం

Published Sun, Dec 21 2014 10:46 PM | Last Updated on Sun, Aug 11 2019 12:30 PM

నవ్వులతో దోచుకుంటాం - Sakshi

నవ్వులతో దోచుకుంటాం

‘‘నరేశ్‌తో ఓ వినూత్న కథాంశంతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను.  అలాంటి కథ కుదరడంతో ఈ ఏడాది మా కాంబినేషన్ కుదిరింది. నరేశ్‌తో నేను తీయాలనుకున్నదానికంటే గొప్ప సినిమా తీశానన్న సంతృప్తి లభించింది. అర్థవంతంగా, ఆరోగ్యకరంగా ఉన్న వినోదంతో సాగే చిత్రం ఇది’’ అని ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారు. ‘అల్లరి’ నరేశ్, ఈష జంటగా ఈవీవీ సినిమా పతాకంపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాజేశ్ ఈదర నిర్మించిన చిత్రం ‘బందిపోటు’. ‘దొంగల్ని దోచుకో’ అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 17తో పూర్తయ్యింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ - ‘‘ఈవీవీ బేనర్ మీద నాన్నగారు ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. మళ్లీ ఈ చిత్రంతో మా బేనర్‌పై సినిమాలు తీయడం ఆరంభించాం. ఇకనుంచి ఏడాదికి రెండు లేక మూడు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాం. ‘బందిపోటు’ని వచ్చే జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నాం. ఆరంభం నుంచి చివరి వరకు వినోదాత్మకంగా సాగే చిత్రం ఇది’’ అన్నారు. రాజేశ్ ఈదర మాట్లాడుతూ- ‘‘ఇంద్రగంటి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. తొలిసారి బయటి దర్శకుడితో చేసిన ఈ సినిమా మా సంస్థ పేరు నిలబెడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇందులో తనది మంచి పాత్ర అని ఈష చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement