పాటలతో సిద్ధమైన థ్రిల్లర్ | Nani - Mohan Krishna Indraganti movie GentleMan! | Sakshi
Sakshi News home page

పాటలతో సిద్ధమైన థ్రిల్లర్

Published Mon, May 16 2016 11:24 PM | Last Updated on Sun, Aug 11 2019 12:30 PM

పాటలతో సిద్ధమైన థ్రిల్లర్ - Sakshi

పాటలతో సిద్ధమైన థ్రిల్లర్

నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అష్టా చమ్మా’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జెంటిల్‌మన్’. బాలకృష్ణతో ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ చాలా విరామం తర్వాత ఈ సినిమా నిర్మిస్తున్నారు. సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఇటీవలే ఈ చిత్రం టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులూ చూసేలా తీర్చిదిద్దుతున్నాం.

ఇటీవల విడుదలైన మా చిత్రం తొలి టీజర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. మణిశర్మ స్వరపరచిన పాటలు ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. ఈ నెల 22న పాటలు విడుదల చేస్తాం. జూన్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, ‘వెన్నెల’ కిశోర్, రోహిణి, ‘సత్యం’ రాజేష్, రమాప్రభ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: పీజీ విందా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement