Romantic Thriller
-
పాటలతో సిద్ధమైన థ్రిల్లర్
నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వచ్చిన ‘అష్టా చమ్మా’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జెంటిల్మన్’. బాలకృష్ణతో ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ చాలా విరామం తర్వాత ఈ సినిమా నిర్మిస్తున్నారు. సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఇటీవలే ఈ చిత్రం టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులూ చూసేలా తీర్చిదిద్దుతున్నాం. ఇటీవల విడుదలైన మా చిత్రం తొలి టీజర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. మణిశర్మ స్వరపరచిన పాటలు ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. ఈ నెల 22న పాటలు విడుదల చేస్తాం. జూన్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, ‘వెన్నెల’ కిశోర్, రోహిణి, ‘సత్యం’ రాజేష్, రమాప్రభ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: పీజీ విందా. -
రొమాంటిక్.. థ్రిల్లింగ్.. హీరో
విజయాలు చాలామందికి వస్తాయి. కానీ, ఆ విజయాల కోసం సాగించే ప్రయాణం కూడా ఆహ్లాదంగా, వైవిధ్యంగా ఉండడం కొందరికే సాధ్యం. యువ హీరో నాని... ఇప్పుడు ఇలా విజయాలతో పాటు ఆ ప్రయాణమూ ఆహ్లాదంగా ఉండేలా చూసుకొంటున్న కొద్దిమంది నటుల్లో ఒకరు. మధ్యలో కొంత జోరు తగ్గినట్లనిపించినా, సహజమైన నటనతో, యువతరానికి బాగా దగ్గరై, వరుసగా మూడు విజయాలతో ఊపు మీద ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, తాజాగా ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ - మూడూ వైవిధ్యభరిత కథలు, పాత్రలే! ఈ వైవిధ్యానికీ, సక్సెస్ లకూ తగ్గట్లే మరో కొత్త చిత్రంతో సిద్ధమవుతున్నారు. గతంలో ‘అష్టాచమ్మా’ ద్వారా కెరీర్‌కు కొత్త ఊపు తెచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నారు. ‘చిన్నోడు - పెద్దోడు’తో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టి, ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, ‘మిత్రుడు’ లాంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. సురభి, నివేదా థామస్‌లు హీరోయిన్లు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు కావడంతో, ఈ చిత్రంలో నాని లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తూ, ‘‘ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్‌కు గురి చేసే అంశాలు, మంచి రొమాన్స్, సెంటిమెంట్, వినోదం - ఇలా అన్నీ ఈ కథలో కుదిరాయి’’ అన్నారు. డేవిడ్ నాథన్ కథ అందించగా, మోహనకృష్ణ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. మణిశర్మ బాణీలకు సీతారామశాస్త్రి, రామ జోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్ సాహిత్యం సమకూరుస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’ కిశోర్, ‘సత్యం’ రాజేశ్ తదితరులు పాత్రధారులు. పరుచూరి మోహన్, రషీద్ అహ్మద్‌ల నిర్మాణ నిర్వ హణలో డిసెంబర్ 2న మొదలైన ఈ చిత్రం ఇప్పటిదాకా హైదరాబాద్ పరిసరాల్లో షూటింగైంది. ‘‘ఇప్పటికి 40 శాతం పూర్తయింది. ఈ 22 నుంచి మార్చి 6 వరకు కొడెకైనాల్లో కొంత టాకీ, పాట చిత్రీకరిస్తున్నాం. మార్చి 14 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిపే షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తి అవుతుంది’’ అని కృష్ణప్రసాద్ తెలిపారు. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రాన్ని మే చివరి వారానికి ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్రయత్నం. నాని కూడా ‘అష్టాచమ్మా’తో తనను తీర్చిదిద్దిన ఇంద్రగంటి, సహనటుడు అవసరాల శ్రీనివాస్‌లతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. బర్త్‌డే బాయ్ లుక్... యూనిట్‌లోని నట, సాంకేతిక నిపుణుల జాబితా చూస్తుంటే, నాని సక్సెస్ట్రాక్లో ముందుకు సాగడం ఖాయమే! -
రొమాంటిక్ థ్రిల్లర్
జ్ఞాన్, సూర్య శ్రీనివాస్, పల్లవి హీరో, హీరోయిన్లుగా రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రైజింగ్ టీమ్ నిర్మించిన చిత్రం ‘నేనొస్తా’. పరంధ్ కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను డా. దాసరి నారాయణరావు ఆవిష్కరించారు. కొత్తవాళ్లు చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలనీ, టైటిల్, లోగో బాగున్నాయనీ దాసరి అన్నారు. పరంధ్ కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘ఇదొక రొమాంటిక్ లవ్‌స్టోరి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే థ్రిల్లర్ మూవీ. కథానుసారం ఉన్న ఐదు పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రచార చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు-రచనా సహకారం: బాషా మజహర్, సంగీతం: అనురాగ్ వినీల్, కెమెరా: శివారెడ్డి. -
రొమాంటిక్ థ్రిల్లర్!
-
రొమాంటిక్ థ్రిల్లర్
ఖయ్యుమ్, సంచితా పదుకొనే జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. కేదారేశ్వరరెడ్డి దర్శకుడు. షేక్ అలీబాషా నిర్మాత. ఈ చిత్ర షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిదనీ, సింగిల్ షెడ్యూల్లో వైజాగ్, హైదరాబాద్‌ల్లో చిత్రీకరణ జరుపుతామనీ దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేశ్ వర్మ. -
హర్రర్ థ్రిల్లర్‌గా 6పీఎం టు 6ఏఎం
ప్రస్తుతం హర్రర్ చిత్రం ట్రెండ్ నడుస్తోందా? అనిపిస్తోంది. కారణం ఈ తరహా చిత్రాలు అధికంగా తెరకెక్కుతున్నాయి. తాజాగా 6 పీఎం టు 6 ఏఎం అనే హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి చెల్లెలి కొడుకు ఆస్కార్ హీరోగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా సూర్యకిరణ్, గౌరి కృష్ణ నటించారు. చిత్రానికి ఛాయాగ్రహణ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన జిస్పాల్ షణ్ముగన్ చిత్ర వివరాలను తెలుపుతూ చిత్ర కథ సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు జరిగే ఇతివృత్తం అని తెలిపారు. మిత్రులైన ఇద్దరు యువతులకు ప్రియుడు ఒకడే కావడంతో ఆ స్నేహితురాళ్ల మధ్య ఈర్ష, ద్వేషాలు కలుగుతాయన్నారు. దీంతో ఒక యువతి ఇంకో యువతిని, ప్రియుడిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకుం టుందన్నారు. వారు మరోజన్మ ఎత్తి మళ్లీ ప్రేమించుకుంటారన్నారు. ఆ తరువాత జరిగే పరిణామాలేమిటన్నది చిత్ర కథ అని తెలిపారు. చిత్రాన్ని పికె జేమ్స్ అండ్ తిలకేశ్వరి మూవీస్ పతాకంపై పికె జేమ్స్, షీలా కురియన్లు నిర్మిస్తున్నారని దర్శకుడు తెలిపారు.