
హర్రర్ థ్రిల్లర్‌గా 6పీఎం టు 6ఏఎం
ప్రస్తుతం హర్రర్ చిత్రం ట్రెండ్ నడుస్తోందా? అనిపిస్తోంది. కారణం ఈ తరహా చిత్రాలు అధికంగా తెరకెక్కుతున్నాయి. తాజాగా 6 పీఎం టు 6 ఏఎం అనే హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి చెల్లెలి కొడుకు ఆస్కార్ హీరోగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా సూర్యకిరణ్, గౌరి కృష్ణ నటించారు. చిత్రానికి ఛాయాగ్రహణ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన జిస్‌పాల్ షణ్ముగన్ చిత్ర వివరాలను తెలుపుతూ చిత్ర కథ సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు జరిగే ఇతివృత్తం అని తెలిపారు.
మిత్రులైన ఇద్దరు యువతులకు ప్రియుడు ఒకడే కావడంతో ఆ స్నేహితురాళ్ల మధ్య ఈర్ష, ద్వేషాలు కలుగుతాయన్నారు. దీంతో ఒక యువతి ఇంకో యువతిని, ప్రియుడిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకుం టుందన్నారు. వారు మరోజన్మ ఎత్తి మళ్లీ ప్రేమించుకుంటారన్నారు. ఆ తరువాత జరిగే పరిణామాలేమిటన్నది చిత్ర కథ అని తెలిపారు. చిత్రాన్ని పికె జేమ్స్ అండ్ తిలకేశ్వరి మూవీస్ పతాకంపై పికె జేమ్స్, షీలా కురియన్‌లు నిర్మిస్తున్నారని దర్శకుడు తెలిపారు.