రొమాంటిక్ థ్రిల్లర్ | Romantic thriller Movie - Nenosta | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ థ్రిల్లర్

Published Fri, Oct 9 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

రొమాంటిక్ థ్రిల్లర్

రొమాంటిక్ థ్రిల్లర్

జ్ఞాన్, సూర్య శ్రీనివాస్, పల్లవి హీరో, హీరోయిన్లుగా రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రైజింగ్ టీమ్ నిర్మించిన చిత్రం ‘నేనొస్తా’. పరంధ్ కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను డా. దాసరి నారాయణరావు ఆవిష్కరించారు. కొత్తవాళ్లు చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలనీ, టైటిల్, లోగో బాగున్నాయనీ దాసరి అన్నారు. పరంధ్ కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘ఇదొక రొమాంటిక్ లవ్‌స్టోరి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే థ్రిల్లర్ మూవీ. కథానుసారం ఉన్న ఐదు పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

త్వరలో ప్రచార చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు-రచనా సహకారం: బాషా మజహర్, సంగీతం: అనురాగ్ వినీల్, కెమెరా: శివారెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement