31 రోజుల్లో షూట్ చేసేశాడు..! | Indraganti Mohan Krishna warps up shooting in 31 days | Sakshi
Sakshi News home page

31 రోజుల్లో షూట్ చేసేశాడు..!

Published Wed, Mar 22 2017 5:00 PM | Last Updated on Sun, Jul 14 2019 4:31 PM

31 రోజుల్లో షూట్ చేసేశాడు..! - Sakshi

31 రోజుల్లో షూట్ చేసేశాడు..!

అష్టా చమ్మా, అంతకు ముందు ఆతరువాత, జెంటిల్మన్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. జెంటిల్మన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఇంద్రగంటి నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కించాలని భావించాడు. అయితే చైతు డేట్స్ కాలీ లేకపోవటంతో ఈ గ్యాప్ లో ఓ కామెడీ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు. అమీ తుమీ పేరులో అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమాను రూపొందించాడు.

ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కేవలం 31 రోజుల్లో పూర్తి చేశాడు.  ఈ సందర్భంగా తనకు సహకరించిన నటీనటులకు యూనిట్ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా, అదితి మాయకల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement