నారి నారి నడుమ నాని! | Mohana Krishna Indraganti to direct Nani | Sakshi
Sakshi News home page

నారి నారి నడుమ నాని!

Published Fri, Apr 1 2016 11:18 PM | Last Updated on Sun, Aug 11 2019 12:30 PM

నారి నారి నడుమ నాని! - Sakshi

నారి నారి నడుమ నాని!

నాని మంచి ఫ్యామిలీ హీరో. పిల్లలూ, పెద్దలూ అందరూ ఇష్టపడతారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి హాయిగా సాగే కుటుంబ కథాచిత్రాలు తీస్తారు. యువతరం కూడా ఆయన చిత్రాలను ఆస్వాదిస్తారు. ఇలా యూత్‌కీ, ఫ్యామిలీస్‌కి దగ్గరైన ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ వస్తే, కచ్చితంగా విభిన్నంగా ఉంటుందని చెప్చొచ్చు. ‘అష్టా చమ్మా’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ థ్రిల్లింగ్ మూవీ రూపొందుతోంది.
 
 ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో నాని ఇద్దరు కథానాయికలతో రొమాన్స్ చేస్తారు. ఆ పాత్రలను సురభి, నివేదా థామస్ చేస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మంచి రొమాంటిక్ కథతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది.
 
 సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ సమాహారంతో సాగే ఈ చిత్రంలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఈ నెల 6 వరకూ సాగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడతాం. మే నెలాఖరున లేక జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement