స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "అల వైకుంఠపురం" మ్యూజికల్ హిట్ కావడంతో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ కెరీర్‌పరంగా ఓమెట్టు పైకి ఎక్కారు. కానీ నాని 25వ సినిమా 'వి'తో రెండు మెట్లు కిందకు దిగారు. ఈ సినిమాకు థమన్ కేవలం బ్యాక్‌గ్రౌండ్ సంగీతం మాత్రమే అందించారు. అతను ఇచ్చిన బీజీఎమ్ అదిరిపోయింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ సంగీతం రాక్షసన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సహా మరికొన్ని సినిమాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను గుర్తు చేస్తోంది. దీంతో థమన్ మరోసారి కాపీ చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ఆరోపణలపై వి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ స్పందించారు. (చదవండి: నాని.. 'వి' సినిమా రివ్యూ)
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్లు కూడా ఆల్‌రెడీ ఉన్న మ్యూజిక్‌నే వాడుతున్నారేంటి? అని అడిగారు. నిజానికి రాక్షసన్‌లో వచ్చే బీజీఎమ్, 'వి'లో థమన్ వాడిన బీజీఎమ్ రెండూ ఒకేలా కనిపించినా అది వేర్వేరు. కాకపోతే మనవాళ్లకు సంగీత పరిజ్ఞానం లేకపోవడంతో కాపీ అంటున్నారు. ఈ ఒక్క సినిమానే కాదు వేరే సినిమాల్లో కూడా సంగీత దర్శకులు కాపీ కొట్టకపోయినా వారిపై కాపీ నిందలు వేస్తారు. అతను సితార్ వాడాడు.. ఇతను సితార్ వాడాడు.. అతను వయొలిన్ వాయించాడు, ఇతను వయొలిన్ వాయించాడు.. సౌండ్స్ సేమ్ అనిపిస్తే చాలు.. కాపీ అనేస్తారు. థమన్ ఎంతో ప్రతిభావంతుడు. అతను కాపీ చేయకపోయినా ఇంత గొడవ చేస్తున్నారు. అలాంటిది నిజంగా చేసుంటే ఊహించలేమేమో" అని ఇంద్రగంటి చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలను ఇంద్రగంటి ఖండించినందుకు తమన్ సంతోషంగా ఫీల్ అయ్యారు. సంగీత దర్శకులు కూడా ఇంత చక్కగా వివరణ ఇవ్వలేరని, లవ్యూ సర్.. అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: పట్టు పట్టు ట్రెండే పట్టు.. మనసులు కొల్లగొట్టు!)
Comments
Please login to add a commentAdd a comment