స్నేహం కోసం నాని..? | Nani guest role in avasarala srinivas Jyo Achyutananda | Sakshi
Sakshi News home page

స్నేహం కోసం నాని..?

Published Sun, Sep 4 2016 10:05 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

స్నేహం కోసం నాని..?

స్నేహం కోసం నాని..?

హ్యాట్రిక్ హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లో కూడా నానికి ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో సినిమాలు చేసే నాని, ఇప్పుడు యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యాడు ఓ యంగ్ డైరెక్టర్.

ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్, రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన సినిమా జ్యో అచ్యుతానంద. నారా రోహిత్, నాగశౌర్యలు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని, అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అవసరాల శ్రీనివాస్తో ఉన్న స్నేహం కారణంగానే నాని ఈ క్యారెక్టర్కు అంగీకరించాడు. సినిమా క్లైమాక్స్లో వచ్చే కీలక మైన పాత్రలో నాని అలరించనున్నాడు. కథను మలుపు తిప్పే ఈ పాత్రం సినిమాకే హైలెట్ అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement