నాని కూడా మొదలెట్టేస్తున్నాడు | Actor Nani to turn producer | Sakshi
Sakshi News home page

నాని కూడా మొదలెట్టేస్తున్నాడు

Published Tue, Oct 18 2016 2:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

నాని కూడా మొదలెట్టేస్తున్నాడు

నాని కూడా మొదలెట్టేస్తున్నాడు

ఈ జనరేషన్ హీరోలు దర్శకులు నిర్మాణ రంగం మీద కూడా దృష్టి పెడుతున్నారు. రెమ్యూనరేషన్ రూపంలో వచ్చే కొద్ది మొత్తం కన్నా.. సినిమా లాభాల్లో వాటా అయితే పెద్ద మొత్తంలో డబ్బు చేతికందుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు కొందరు సొంతం నిర్మాణ సంస్థలను స్టార్ చేయగా తాజాగా ఓ యంగ్ హీరో కూడా ఈ లిస్ట్లో చేరడానికి రెడీ అవుతున్నాడు.

ఈ ఏడాది మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని త్వరలోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. తన బంధువుతో కలిసి బ్యానర్ను స్థాపించే ఆలోచనలో ఉన్నాడు. బ్యానర్లో తెరకెక్కబోయే తొలి సినిమాలో తానే హీరోగా నటిస్తుండగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు.

అయితే గతంలోనూ నాని ఓ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు.  డి ఫర్ దోపిడి తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినా..? పూర్తి స్థాయి నిర్మాతగా సొంతం బ్యానర్ మాత్రం స్థాపించలేదు. త్వరలోనే తను హీరోగా నటించనున్న సినిమాతో నిర్మాతగా మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఈ నాచ్యురల్ స్టార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement