‘జ్యో అచ్చుతానంద’ చిత్ర బృందం సోమవారం ఉదయం కలియుగ వైకుంఠదైవం శ్రీనివాసుడిని దర్శించుకుంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు, చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్, సంగీత దర్శకుడు కోడూరి కళ్యాణ్, నటి సుధాతోపాటు పలువురు ఆర్టిస్టులు స్వామివారిని దర్శించుకున్నారు. సినిమా పూర్తైన తర్వాత తిరుమల వెంకటేశ్వరుడి దర్శించుకోవాలని ముందే అనుకున్నామని... అందుకే వచ్చామన్నారు. సినిమా విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.