
ఆ హీరోకి మొహం చాటేశారు
సినిమా రంగం సక్సెస్ వెంటే పరిగెడుతుంది అన్న నిజం మరోసారి రుజువైంది. మొన్నటి వరకు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా కనిపించిన ఓ యంగ్ హీరోకి, ఒక్క ఫ్లాప్ వచ్చేసారికి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. 'చందమామ కథలు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య ఆ తరువాత వరుస సక్సెస్లతో బిజీ హీరోగా మారిపోయాడు. కానీ ఒక్క ఫ్లాప్ ఈ యంగ్ హీరో కెరీర్నే టర్న్ చేసింది.
'ఊహలు గుసగుసలాడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య తరువాత 'దిక్కులు చూడకు రామయ్య', 'లక్ష్మీ రావే మా ఇంటికీ' సినిమాలతో మంచి విజయాలు సాధించాడు. అయితే ఈ సినిమాలన్నింటిలో లవర్బాయ్గా కనిపించిన నాగశౌర్య, యాక్షన్ టర్న్ తీసుకొని చేసిన 'జాదుగాడు' సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఫెయిల్యూర్ నాగశౌర్య కెరీర్నే కష్టాల్లో పడేసింది.
'జాదుగాడు' సినిమాకు ముందు చేతినిండా సినిమాలతో బిజీగా కనిపించిన నాగశౌర్య ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. గతంలో నాగశౌర్య ఖాతాలోనే ఉన్న అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఊహలు గుసగుసలాడే సీక్వెల్తో పాటు, మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో సినిమాలకు కూడా ఇప్పుడు వేరే హీరోలను ఫైనల్ చేశారు. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉన్న నాగశౌర్య ఆ సినిమాతో అయిన హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని ట్రై చేస్తున్నాడు.