తిరుమలలో జ్యో అచ్యుతానంద టీమ్ | Jo Achyutananda Movie Team visit Tirumala Temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో జ్యో అచ్యుతానంద టీమ్

Published Mon, Sep 12 2016 10:43 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

తిరుమలలో జ్యో అచ్యుతానంద టీమ్

తిరుమలలో జ్యో అచ్యుతానంద టీమ్

తిరుపతి : ‘జ్యో అచ్యుతానంద’  చిత్ర బృందం సోమవారం ఉదయం కలియుగ వైకుంఠదైవం శ్రీనివాసుడిని దర్శించుకుంది.  ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌రాజు,  చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌, సంగీత దర్శకుడు కోడూరి కళ్యాణ్‌, నటి సుధాతోపాటు పలువురు ఆర్టిస్టులు స్వామివారిని దర్శించుకున్నారు. సినిమా పూర్తైన తర్వాత తిరుమల వెంకటేశ్వరుడి దర్శించుకోవాలని ముందే అనుకున్నామని... అందుకే వచ్చామన్నారు. సినిమా విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ...‘సినిమా హిట్కు, ఫ్లాప్కు సంబంధం లేకుండా తిరుమల వద్దామని ముందే అనుకున్నాయి. అయితే సినిమా మంచి విజయం సాధించటం చాలా ఆనందంగా ఉంది. మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్ అంటే కొర్రపాటి సాయి గారితో ఇంకో సినిమా చేస్తున్నాను. కాకపోతే కొంచెం టైమ్ పడుతుంది' అని తెలిపాడు.

మ్యూజిక్ డైరెక్టర్ కోడూరి కళ్యాణ్ మాట్లాడుతూ.... ’జ్యో అచ్యుతానంద’ పదాన్ని అన్నమాచార్య కృతి నుంచి తీసుకుని సినిమా టైటిల్గా పెట్టుకున్నాం. సినిమా సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. సాయి గారి బ్యానర్లో మరో సినిమాకు సంగీతం అందించబోతున్నా..అని తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement