
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలె కార్తికేయ నటించిన చిత్రం చావు కబురు చల్లగా యావరేజ్ టాక్‌ను సంపాదిచుకుంది. ప్రస్తుతం 'రాజా విక్రమార్క' అనే ప్రాజెక్టులో నటిస్తున్న కార్తికేయ ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా 'రుహాని శర్మ'ను ఫిక్స్ చేశారట. 'డర్టీ హరి' చిత్రంతో రుహాని మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. లవ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ పరిచయం కానున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment