రుహానీ శర్మ.. వెండి తెర నటి. ఇటు గ్లామరస్ రోల్స్.. అటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను పోషిస్తూ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటోంది. ఇప్పుడు వెబ్ తెరకూ పరిచయమై అక్కడా చక్కటి అవకాశాలను అందుకుంటోంది. ఆమె గురించి కొన్ని వివరాలు..
రుహానీ శర్మ సొంతూరు హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్. ఆర్ట్స్‌లో డిగ్రీ చేసిన ఆమె తొలుత కొన్ని వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. అలా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణ్‌తో కలసి ఓ యాడ్‌లో నటించింది. ఆ యాడ్ చూసిన దర్శకుడు రాహుల్ రవీంద్ర.. రుహానీకి సినిమా ఛాన్స్ ఇచ్చాడు.. ‘చి.ల.సౌ.’తో! అది ఆమెకు ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. తర్వాత ‘హిట్’, ‘డర్టీ హరి’, ‘101 జిల్లాల అందగాడు’ వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.
తెలుగు సినిమాలే కాకుండా కొన్ని పంజాబీ కవర్ సాంగ్స్‌తో పాటు ‘కడైసి బెంచ్ కార్తీ’ అనే తమిళ చిత్రంలోనూ అభినయించింది. ఈ మధ్యనే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ‘పాయిజన్’ అనే జీ5 వెబ్ సిరీస్‌తో. ఆమె రావడమే ఆలస్యం వరుస అవకాశాలు క్యూ కట్టాయి. సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘మీట్ క్యూట్’ అనే ఆంథాలజీతో స్టార్‌గా వెలుగుతోంది. ప్రస్తుతం ‘ఆగ్రా’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘హర్’ అనే మరో హిందీ చిత్రంతో పాటు, వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్’లోనూ నటిస్తోంది.
సినిమా అంటేనే గ్లామర్. సో.. మితిమీరని గ్లామర్‌కు నో చెప్పను. కానీ, వల్గారిటీకి మాత్రం నేనెప్పుడూ వ్యతిరేకినే.
– రుహానీ శర్మ
Comments
Please login to add a commentAdd a comment