ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టిన రుహానీ శర్మ | Release Date Poster Of Ruhani Sharma HER | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టిగేషన్‌ షురూ చేసిన రుహానీ శర్మ

Published Sun, Jun 25 2023 6:06 AM | Last Updated on Sun, Jun 25 2023 8:48 AM

Release Date Poster Of Ruhani Sharma HER - Sakshi

రుహాణీ శర్మ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ‘హర్‌’. శ్రీధర్‌ స్వరాఘవ్‌ దర్శకత్వంలో రఘు సంకురాత్రి, దీపాసంకురాత్రి నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా ఈ సినిమా జూలై 21న విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత డి. సురేష్‌బాబు ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. వికాస్‌ వశిష్ట, ప్రదీప్‌ రుద్ర, జీవన్‌ కుమార్, అభిగ్న్య, సంజయ్‌ స్వరూప్, బెనర్జీ, రవివర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: పవన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement