అదృష్టం అనేది ఎవరిని ఎప్పుడు వరిస్తుందో తెలియదు. అది వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. నటి రుహానీశర్మ పరిస్థితి ఇలాంటిదే. ఈ బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా, ప్రముఖ క్రికెట్ కళాకారుడు విరాట్ కోహ్లి భార్య, నటి అనుష్కశర్మకు దగ్గర బంధువు. కథానాయకిగా హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న రుహానీశర్మ కోలీవుడ్‌కు సుపరిచితమే. 2017లో కడసీ బెంచ్ కార్తీక్ అనే చిత్రం ద్వారా ఈమె కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు.
అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో రుహానీశర్మను ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. అలాంటిది 7 ఏళ్ల తర్వాత ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో మరో మంచి అవకాశం లభించడం విశేషం. నటుడు కవిన్‌కు జంటగా మాస్క్ చిత్రంలో రుహానీశర్మ నటించనున్నారన్నది తాజా సమాచారం. దర్శకుడు వెట్రిమారన్ తన గ్రాస్ రూట్ కంపెనీ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రనన్ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆండ్రియా ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో చార్లీ బాలసర్వం ఆర్జే అర్చన ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా మే నెల చివరి వారంలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీనికి జీవీ. ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని ఆర్డీ రాజశేఖర్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం నటి రుహానీశర్మకు మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి. స్టార్ వంటి హిట్ చిత్రం తర్వాత నటుడు కవిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కావడం, దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న చిత్రం కావడంతో మాస్క్‌పై మంచి అంచనాలే నెలకొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment