శైలేష్ కొలను
‘‘పుస్తకం, సినిమా, వెబ్‌సిరీస్... ఇలా ఏదైనా సరే మంచి కథలను ప్రేక్షకులకు చెప్పాలనుకుంటాను. మా నాన్నగారికి తెలియకుండానే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాను. నేను ‘హిట్’ సినిమా తీశాక నాన్నగారు షాక్ అయ్యారు’’ అని శైలేష్ కొలను అన్నారు. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ఉపశీర్షిక. హీరో నాని సమర్పణలో ప్రశాంతి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.
శైలేష్ కొలను మాట్లాడుతూ – ‘‘నానీగారికి పెద్ద అభిమానిని. ఆయనకి చెప్పిన కథల్లో ‘హిట్’కి నిర్మాతగా ఓకే అన్నారు. ‘హిట్’కి వచ్చే ఏడాది సీక్వెల్ కూడా ఉంటుంది. ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా సెకండ్ మూవీ సిండ్రోమ్ (డైరెక్టర్‌గా తొలి విజయం సాధించి, రెండో సినిమా ఫ్లాప్ కావడం) సమస్య గురించి విన్నాను. నా విషయంలో అది జరగదనే నమ్మకం ఉంది. ఆ భయం నా బాధ్యతను పెంచుతుందనుకుంటున్నాను. నా పారితోషికాన్ని కూడా పెంచాలనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment