మనసుని హత్తుకునేలా ‘శ్రీరంగ నీతులు’.. రిలీజ్‌ఎప్పుడంటే?  | Actor Suhas And Viraj Ashwin Sri Ranga Neethulu Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Sri Ranga Neethulu Release Date: మనసుని హత్తుకునేలా ‘శ్రీరంగ నీతులు’.. రిలీజ్‌ఎప్పుడంటే? 

Mar 9 2024 11:10 AM | Updated on Mar 9 2024 11:30 AM

Sri Ranga Neethulu Release Date Out - Sakshi

రుహానీ శర్మ, సుహాస్, కార్తీక్‌ రత్నం, విరాజ్‌ అశ్విన్‌  ముఖ్య తారలుగా ప్రవీణ్‌కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీరంగ నీతులు’. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించిన ఈ సినిమాని ఏప్రిల్‌ 12న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ వీఎస్‌ఎస్‌ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘శ్రీరంగ నీతులు’. యువతరం భావోద్వేగాలు, సహజంగా సాగే మాటలు, మనసుని హత్తుకునే సన్నివేశాలు ఉంటాయి. కొత్తదనంతో పాటు వాణిజ్య అంశాలతో రూపొందిన మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు.

‘‘నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు, వినోదం.. ఇలా అన్ని అంశాల కలయికతో అందర్నీ అలరించేలా ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు’’ అన్నారు వెంకటేశ్వరరావు బల్మూరి. ఈ చిత్రానికి కెమెరా: టీజో టామీ, సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్, అజయ్‌ అరసాడ.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement