బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి ఓ టూర్‌కి వెళ్లొస్తే కావల్సినంత ఉత్సాహం, ఎనర్జీ వస్తాయి. కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం వల్ల మన ఆలోచన తీరే మారిపోతుంది. ఆ ఇన్‌స్పిరేషన్‌తోనే ఫ్యాషన్ విషయంలోనూ ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తుంటా! అంటోంది రుహానీ శర్మ. ఇక ఆమె నటించిన సినిమాలు విజయం సాధించకపోయినా, సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. కారణం.. అప్ టు డేట్‌గా ఉండే ఆమె ఫ్యాషన్ స్టయిలే! ఆ యూనిక్‌నెస్ కోసం రుహానీ ఫాలో అవుతున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి..
రియా జ్యూయెల్స్..
ట్రెండీ డిజైన్స్‌కు పెట్టింది పేరు రియా జ్యూయెల్స్. ఇదొక ఆన్‌లైన్ జ్యూలరీ స్టోర్. ఆకట్టుకునే.. వైవిధ్యమైన డిజైన్స్‌ను రూపొందిస్తూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అన్ని రకాల బంగారు, వెండి, బంగారు పూత నగలతోపాటు ఫ్యూజన్, నక్షీ, నవరతన్ వంటి ఇతర డిజైనర్ నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసే వీలుంది.
నీరూస్..
నాలుగు దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దేశీ బ్రాండ్ నీరూస్! దీనిని 1971లో హరీష్ కుమార్ ప్రారంభించారు. చక్కటి ఎంబ్రాయిడరీ, అందమైన డిజైన్స్‌లో లభించే వీరి దుస్తులకు మంచి ఆదరణ దొరకడంతో 1983లో ‘నీరూస్ టెక్స్‌టైల్స్’ పేరుతో ఫ్యాబ్రిక్ తయారీ సంస్థనూ ప్రారంభించారు. ఈ బ్రాండ్ డిజైన్స్‌కు విదేశాల్లోనూ డిమాండ్ ఎక్కువే. అయినా ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయి. పలు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. రుహానీ శర్మ ధరించిన నీరూస్ డిజైన్ చీర రూ. 24, 190/-
--దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment