సస్పెన్స్‌ , క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘హర్‌’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్‌ | Natural Star Nani Launched Teaser HER Chapter 1 | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ , క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘హర్‌’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్‌

Published Wed, Jan 18 2023 5:20 PM | Last Updated on Wed, Jan 18 2023 5:32 PM

Natural Star Nani Launched Teaser HER Chapter 1 - Sakshi

రుహాని శర్మ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘హర్‌’. శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను నటుడు నాని విడుదల చేశారు.

మిస్టరీ మర్డర్‌ కేసును చేధించే క్రమంలో ఓ మహిళా పోలీస్‌ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? అనే ఆసక్తికర అంశాలతో ఈ టీజర్‌ రూపుదిద్దుకుంది. డ్యూటీ పరంగా 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఓ హత్య కేసును ఛేదించడానికి తిరిగి ఖాకీ డ్రెస్ ధరించిన రుహాణి శర్మ సీన్ తో మొదలైన ఈ టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement