
విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్: ది ఫస్ట్ కేస్’. హీరో నాని, ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా విడుదలై ఫిబ్రవరి 28కి ఏడాది పూర్తయింది. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు నాని ప్రకటించారు. ‘‘హిట్’ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ‘హిట్ 2’ చిత్రాన్ని ప్రకటించడానికి ఇంతకన్నా మంచి రోజు లేదు. కనిపించకుండా పోయిన అమ్మాయి కేసును ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు ఎలా డీల్ చేశారనే కథాంశంతో తెలంగాణ హిట్ టీమ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా హిట్ సినిమాను రూపొందించాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిట్ టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ కేసును ఆఫీసర్ కె.డి ఆసక్తికరంగా ఎలా డీల్ చేస్తారో చూపించబోతున్నాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు నాని.
Comments
Please login to add a commentAdd a comment