విష్ణు విశాల్‌తో క్యాథరిన్ | Vishnu Vishal to romance Catherine Teresa | Sakshi
Sakshi News home page

విష్ణు విశాల్‌తో క్యాథరిన్

Published Sun, Apr 26 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

విష్ణు విశాల్‌తో క్యాథరిన్

విష్ణు విశాల్‌తో క్యాథరిన్

మెడ్రాస్ హీరోయిన్‌కు కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది. టాలీవుడ్‌లో ఇద్దరమ్మాయిలు, ఎర్రబస్సు చిత్రాలు చేసిన క్యాథరిన్ ట్రైసా ఆ తరువాత కనిపించలేదు. అయితే మెడ్రాస్ చిత్ర విజయం ఆమెకు కోలీవుడ్‌లో మరో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. యువ నటుడు విష్ణు విశాల్‌తో జత కట్టడానికి క్యాథరిన్ రెడీ అవుతున్నారన్నది తాజా న్యూస్. జీవా వంటి విజయవంతమైన చిత్రం తరువాత విష్ణు విశాల్ నటిస్తున్న చిత్రం (ఇంకా పేరు నిర్ణయించలేదు) నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
 
  దీంతో విష్ణు విశాల్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి వీరధీర సూరన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. అయితే శకుని చిత్రం ఫేమ్ శంకర్‌దయాళ్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో విష్ణు విశాల్ సరసన క్యాథరిన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. చిత్ర షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. క్యాథరిన్‌కు ఎందుకనో కోలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. మరి ఈ వీర ధీర శూరన్ చిత్రం ఈ అమ్మడి కెరీర్‌కు ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement