Vara Lakshmi
-
వరలక్ష్మి కృపకు ఆఖరి శుక్రవారం...ముఖ్యంగా పెళ్లికాని పడతులకు
మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం శ్రావణమాసపు రెండో శుక్రవారం జరుపుకోవడం శాస్త్రంగా ఎంతో కాలం జరుగుతూ వస్తున్నది. అయితే ఏదైనా కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం కానీ, ప్రత్యేక పూజలు కానీ చేసుకోలేని వాళ్లకు ఆఖరి శుక్రవారం చివరి అవకాశంగా భావిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, సకలశుభాలు కలగాలని ప్రార్థిస్తారు.చివరి రోజు మరింత ప్రత్యేకం..శ్రావణమాసం, శుక్రవారాలు ఎంత ప్రత్యేకమైనవో వేరుగా చెప్పక్కర్లేదు. అయితే శుభప్రదమైన శ్రావణమాసంలో చివరి వారం కావడంతో బోలెడంత సందడి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిల లక్ష్మీ దేవి పూజకు మరింత ప్రత్యేకమని చెప్పాలి. ఆఖరి రోజు వ్రతం చేస్తే:ఆఖరి రోజున ఉపవాసం పాటించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. ఈ రోజున యథావిధిగా రకరకాల పిండి వంటలు, క్షీరాన్నం, పళ్లు, పూలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ శుభసమయంలో శ్రీ యంత్రానికి పూజలు నిర్వహిస్తారు. రాత్రి నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ హ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే లక్ష్మి ఇంట్లో నివాసం ఉంటుందని నమ్మకం.అలాగే వరలక్ష్మి రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 11 పసుపు పిండి ముద్దలను లక్ష్మీదేవి పాదాలకు సమర్పించి, పూజ తర్వాత వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచితే దీనివల్ల ఆర్థిక లబ్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. లక్ష్మీదేవికి కొబ్బరికాయ సమర్పించాలి. దీనివల్ల ఆర్థిక లబ్ది పొందే అవకాశం ఏర్పడుతుంది. పెళ్లికాని పడుచులకు వరం..పూజ చేసుకున్న వారి నుంచి తాంబూలం తీసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకు తొందరగా పెళ్లవుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. వరమహాలక్ష్మి వివిధ రూపాలలో కరుణిస్తుందని, అన్ని సమస్యలు తొలగిపోయి పెళ్లి జరిగేలా అనుకూలత ఇస్తుందని నమ్మకం. అందుకే కొన్ని ప్రాంతాలలో ఈ రోజు భక్తితో ఉపవాసం ఉండి, పూజ చేసుకుని ముత్తైదువుల నుంచి తాంబూలం అందుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. -
వేసవిలో నాగకన్య
జై, వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘నీయా 2’. తెలుగులో ‘నాగకన్య’ అనే టైటిల్ పెట్టారు. ఎల్. సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ. శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని వరలక్ష్మి శరత్‌కుమార్, లక్ష్మీ రాయ్ ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు క్యాథరీన్ లుక్‌ను రిలీజ్ చేస్తారు. రేపు ‘నాగకన్య’ టీజర్ విడుదల అవుతుంది. ‘‘రిలీజ్ చేసిన లుక్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. సినిమాలో హీరో జై క్యారెక్టర్ హైలైట్‌గా ఉంటుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. స్టోరీ, స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉంటాయి. గ్రాఫిక్స్ ఆడియన్స్‌ను అబ్బుర పరుస్తాయి. వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
అవును.. ఉంది!
అవును ఉంది. అసమానత ఉంది. వేధింపు ఉంది. సాధింపు ఉంది. దోపిడీ ఉంది. క్యాస్టింగ్ కౌచ్ కూడా ఉంది. అప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది. నిర్భయంగా బయటికొచ్చి మాట్లాడితేనే.. వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటివాళ్లు అదే చేస్తున్నారు. తప్పు చెయ్యడానికీ.. తప్పుడు ఆలోచనలు చెయ్యడానికీ భయపడేలా.. ఆత్మగౌరవం ప్రదర్శిస్తున్నారు. ‘ఇది మంచి పరిణామం..’ అంటున్నారు శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి. ఈ యంగ్ అండ్ డైనమిక్ తమిళ స్టార్.. ‘సాక్షి’తో చాలా బోల్డ్‌గా.. పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నారు. చదవండి. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ఈ ఏడాది సుమారు ఆరు సినిమాల్లో కనిపించారు. ఎలా మ్యానేజ్ చేస్తున్నారు? రిలీజ్ సంగతి నిర్మాతలు చూసుకుంటారు. మనం మ్యానేజ్ చేసేది ఏం ఉండదు. నాకు నచ్చిన సినిమాల్లో కనిపిస్తున్నాను. ఒకే ఏడాది ఇన్ని సినిమాల్లో భాగమైనందుకు హ్యాపీగా ఉన్నాను. హీరోయిన్ అంటే సన్నగా, నాజూకుగా ఉండాలనేది ఇప్పటి ట్రెండ్. మీరు కొంచెం బొద్దుగా, టామ్‌బాయ్‌లా ఉంటారు. తగ్గాలని అనుకున్నారా? నేను హీరోయిన్ క్యాటగిరీలోనే ఉండాలనుకోను (నవ్వుతూ). అలాగే హీరోయిన్స్ అంటే సన్నగానే ఉండాలి అనే విషయాన్ని కూడా నమ్మను. ఒకప్పుడు బొద్దుగా ఉన్న హీరోయిన్సే సౌత్‌లో టాప్‌గా నిలిచారు. ఆ తర్వాతి తరంలో విద్యాబాలన్, అనుష్క బ్రిలియంట్ యాక్టర్స్. ముందు మనందరం బాడీ షేమింగ్ ఆపేయాలి. నువ్వు సన్నగా ఉండాలి, బరువు తగ్గాలి అని నాకెవరైనా సలహా ఇస్తే ‘నువ్వేమైనా నా బరువు మోస్తున్నావా?’ అన్నట్టుగా సమాధానం ఇస్తాను. నేనేం తింటే నీకేంటి? అన్నట్లుగా మాట్లాడతాను. ఆరోగ్యంగా ఉన్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఒకవేళ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ మిమ్మల్ని బరువు తగ్గాలని డిమాండ్ చేస్తే? తగ్గుతా. సినిమా కోసం చేయడం వేరు. ‘మాస్టర్ పీస్’ అనే మలయాళ సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర చేశాను. పోలీస్ యూనిఫామ్ అంటే ఫిట్‌గా ఉండాలి. దర్శకుడు అడిగారని కాదు.. నాకే అనిపించి తగ్గాను. తమిళ సినిమా ‘తారై తప్పటై్ట’ కోసం దర్శకుడు బాలా సార్ నన్ను బరువు పెరగమన్నారు. ఎందుకంటే అందులో నేను కరకాట్టమ్ డ్యాన్సర్‌గా చేయాలి. వాళ్లు లావుగా ఉంటారు. ఆ క్యారెక్టర్‌కి బరువు పెరగడం అవసరం అనిపించింది, పెరిగాను. యాక్చువల్లీ ‘బాడీ షేమింగ్’ అనేది మనం తీసుకొచ్చింది. ఎవరు ఎలా ఉండాలో మ్యాగజీన్స్, సోషల్ మీడియా నిర్ణయిస్తున్నట్టుంది. హీరోయిన్ ఎలా ఉండాలి? అనేది కూడా బయటివాళ్లే డిసైడ్ చేసేస్తారు. మ్యాగజీన్లో చూపించినట్టుగా ఏ హీరోయిన్ కూడా నిద్ర లేచినప్పుడు ఫ్రెష్‌గా ఉండదు. అందరిలానే పొద్దునే చెదిరిన జుట్టుతో నిద్రకళ్లతో ఉంటారు (నవ్వుతూ). ఎవరైనా హీరోయిన్లా ఉండాలని ఎందుకనుకోవాలి? మీరు మీలా ఉండండి. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంటే అదే అందం. ఎవరైనా అందంగా ఉంటే అభినందించండి. కానీ వేరే వాళ్లను కూడా వాళ్లలా ఉండమని పోలికలు పెట్టి, వాళ్ల కాన్ఫిడెన్స్ తగ్గించకండి. ఇలా ఏది అనుకుంటే అది చెప్పేస్తారు కాబట్టే ఏడాది క్రితమే ‘మీటూ’ లాంటి ఇష్యూ గురించి మాట్లాడారు. కానీ అప్పుడు చాలామంది బయటకు రాలేదు. ఎందుకు? భయం అయ్యుండొచ్చు. మీకెందుకు భయం లేదంటారు? మీ వెనక మీ నాన్న (నటుడు శరత్‌కుమార్) ఉన్నారనే ధైర్యమా? బ్యాగ్రౌండ్ ఉపయోగించుకోకుండా సొంతంగా నిలబడాలనుకునే స్వభావం నాది. నేనేదైనా చేయాలనుకున్నప్పుడు నాన్నగారికి చెప్పను. అన్నీ చేసేసిన తర్వాత ఆయనకు తెలుస్తుంది (నవ్వుతూ). అరే.. ఇలా చేస్తున్నా అని నాకు చెప్పలేదే అంటుంటారు. నేను ఇండిపెండెంట్ పర్సన్‌ని. భయం లేదు. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. ఒకవేళ చిక్కుకున్నా అందులో నుంచి ఎలా బయటకు రావాలో కూడా తెలుసు. స్టార్ కిడ్స్ లైంగిక వేధింపులకు గురవ్వరని అనుకుంటుంటారు. అదెంత వరకూ నిజం? అస్సలు కాదు. నా విషయంలో జరిగింది కదా. ఓ టీవీ చానల్‌కి సంబంధించిన వ్యక్తి అందరి మధ్యలో నాతో బాగా మాట్లాడి, ఆ తర్వాత ‘మిగతా విషయాలు మనం బయట మాట్లాడుకుందాం’ అన్నాడు. ‘మిగతా విషయాలు’ అనే మాటలో చాలా అర్థం ఉంది. నేను స్టార్ కిడ్నే కదా. అయినా నాతో ‘కాంప్రమైజ్’ గురించి మాట్లాడాడంటే.. ఇంకెంత మంది దగ్గర ఇలా అడిగి ఉంటాడు? ఆ కోపంతోనే ఆ విషయం గురించి బయటకు వచ్చి మాట్లాడాను. మీరు స్త్రీవాది అనిపిస్తోంది. అయితే ఫెమినిజమ్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటివారికి ఫెమినిజమ్ అంటే ఏంటి? అనేది చెబుతారా? స్త్రీలకు సమానత్వం ఇవ్వడం లేదు అనే దాంట్లో నుంచి పుట్టిందే ఫెమినిజం. మగవాళ్లలో కూడా చాలామంది ఫెమినిస్ట్‌లు ఉన్నారు. ఎందుకంటే వాళ్లు స్త్రీలను గౌరవిస్తారు కాబట్టి. దక్కాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నవాళ్లను స్త్రీవాది అంటాం. మగవాళ్ల మీద లేనిపోని నిందలు వేయడం స్త్రీవాదం కాదు. సమానత్వం వచ్చే వరకూ ఫెమినిజం అనేది ఉంటుంది. హీరోయిన్, విలన్, స్పెషల్ రోల్స్.. ఇలా అన్నీ చేస్తున్నారు. ఒక సెట్ నుంచి మరో సినిమా సెట్‌కు వెళ్లేప్పుడు ఆ మూడ్ వేరియేషన్స్ ఎలా చూపించగలుగుతున్నారు? మీరు ఐటీ జాబ్ చేస్తున్నారు అనుకుందాం. రోజూ ఒకే మూడ్‌తో ఆఫీస్‌కు వెళ్లరు కదా. అయినా రోజూ చేసే పనిని పర్ఫెక్ట్గా చేయాలి. మా పని కూడా అంతే. సెట్ నుంచి సెట్‌కి మారుతుంటే కథ, పాత్ర, కాస్ట్యూమ్స్ మారొచ్చు కానీ అదే యాక్టింగ్. దర్శకుడు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకోగలిగితే మన పని సులువు అయిపోతుంది. (ఇటీవల రిలీజైన్ ‘సర్కార్’ , ‘పందెం కోడి–2’,చిత్రాల్లో... , రిలీజ్‌కు రెడీ అయిన ‘మారి–2’లో.. ) ఇంత బోల్డ్‌గా, ముక్కుసూటిగా ఉండే స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? మీ అమ్మగారా? నాన్నగారి దగ్గర్నుంచా? మా అమ్మ. ఆమే నా ధైర్యం. ఆవిడలో సగం ధైర్యవంతురాలిగా ఉన్నా కూడా నేను చాలా లక్కీ అనే అనుకుంటాను. నన్ను, నా చెల్లిని ఎలాంటి సపోర్ట్ లేకుండా తనొక్కతే పెంచింది. స్ట్రాంగ్ ఉమెన్. నా బలం ఆమె దగ్గర నుంచి వచ్చింది. అమ్మ ఎప్పుడైనా వేధింపులకు గురయ్యారా? అవి షేర్ చేసుకుని, మీకు ధైర్యం నూరిపోశారా? వేధింపులకు గురి కాలేదు. కానీ ఒకసారి ఎవరో దొంగతనానికి వస్తే ఒక్కతే అతన్ని ఎదుర్కొంది. ఫట్‌ఫట్‌మని చెంప దెబ్బలు ఇచ్చిందట. నిజం కోసం మా అమ్మగారు బలంగా నిలబడతారు. తన దగ్గరనుంచే నాకీ ధైర్యం వచ్చింది అనుకుంటాను. ఓకే.. యాక్టర్‌గా ఇంత బిజీలోనూ స్త్రీ సంక్షేమ కార్యక్రమాలతో యాక్టీవ్‌గా ఉంటారు. సమయాన్ని ఎలా కేటాయిస్తారు? ‘సేవ్ శక్తి’ అనే క్యాంపెయిన్ నడుపుతున్నాను. దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఎక్కువగా మా అమ్మగారు చూసుకుంటారు. గృహ హింసకు గురైనవారిని, లైంగిక వేధింపులకు గురైనవారిని కాపాడుతుంటాం. దానికి ఫండ్స్ రైజ్ చేస్తూ ఉంటాను నేను. ఒక స్త్రీ ఏదైనా చేదు అనుభవం ఎదుర్కొన్నప్పుడు ఆ విషయాన్ని బయటికి చెబితే ఆమెనే తప్పుబడుతూ కొందరు నిందిస్తారు. దీని గురించి ఏమంటారు? ఇది నేను చాలా చోట్ల చూశాను. అతను అలా హద్దులు మీరడానికి నువ్వే చాన్స్ ఇచ్చి ఉంటావనే అర్థంతో మాట్లాడతారు. కావాలని ఏ స్త్రీ అయినా చేదు అనుభవం కోరుకుంటుందా? ఆమెను నిందించి, నోరు నొక్కేయాలనుకోవడం సరి కాదు. నిందిస్తున్నారని భయపడి సైలెంట్ అయిపోవడమూ కరెక్ట్ కాదు. ఎవరేమన్నా నిర్భయంగా ఉండాలి.. పోరాడాలి. రచయిత వైరముత్తుని కొందరు నిర్భయంగా ఆరోపిస్తున్నారు. అసలు వైరముత్తు నిజంగా అలాంటి మనిషే అనుకుంటున్నారా? మన అభిప్రాయాలతో పని లేదు. రచయితగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన చేస్తున్న పనిలో కానీ ఆయన స్థాయిని కానీ ఎవ్వరం ప్రశ్నించడం లేదు. పర్సనల్ లైఫ్ గురించే ప్రశ్న. సెలిబ్రిటీ అయినంత మాత్రాన మంచి వ్యక్తి అయ్యుంటారని అనుకోలేం. అలాగే కామన్ మ్యాన్, పేదవాళ్లు అయినంత మాత్రాన చెడు వ్యక్తులు అనలేం. మనుషులు ఎలా అయినా ఉండచ్చు. చిన్మయి, మరికొందరు ఆరోపించినట్టుగా అందులో నిజం ఉంటే కచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ‘మీటూ’ ఉద్యమం ప్రధమ లక్ష్యం ‘నేమ్ దెమ్.. షేమ్ దెమ్’ (పేరు బయటకు చెప్పి పరువు తీయడం). అప్పుడు భయం వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటారా? డెఫినెట్‌గా ఉంది. పాత తరం వాళ్లు కొందరు లొంగిపోవడం వల్లో, సినిమాల్లో ఇది భాగమేమో అనుకోవడంవల్లో, ఇలాంటి విషయాలు బయటకు చెప్పకూడదేమో అని భావించడం వల్లో క్యాస్టింగ్ కౌచ్ కంటిన్యూ అయిందేమో. సినిమాల విషయానికి వద్దాం. దివంగత నటి, తమిళ నాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌లో చేస్తున్నారట? ఇంకా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. అమ్మ రోల్ చేయాలని నాకూ ఉంది. ఆమె నా రోల్ మోడల్. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశిస్తానన్నారు. పాలిటిక్స్‌ని డీల్ చేయడం సులువు కాదేమో? సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందిని డీల్ చేయాలి కదా. అలాగని నేను ఆగిపోలేదు. వచ్చాను, మార్చాను. రాజకీయాల్లోనూ అంతే. రాజకీయ నాయకురాలిగా మారి ఎటువంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నారు? నా ముఖ్యోద్దేశం స్త్రీల హక్కుల కోసం నిలబడటమే. 50 శాతం ఓటు బ్యాంక్ స్త్రీలే అని గుర్తించరెందుకో అర్థం కాదు. ఒకవేళ స్త్రీ అనుకుంటే తన ఇంట్లో ఓట్లన్నీ తనకు కావాల్సిన వాళ్లకు వేయించగలదు. లేదంటే అన్నం పెట్టదు (నవ్వుతూ). వేరే రకం వాళ్లు కూడా ఉన్నారు. మా ఆయన ఎవరికి ఓటు వేస్తే నేనూ వాళ్లకే ఓటు వేయాలి అనుకునేవారు. అవన్నీ మారాలి. అలాంటి మార్పు తీసుకురావాలి అనుకుంటున్నాను. ప్రతి స్కూల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలుసుకోవడానికి సెక్స్ ఎడ్యుకేషన్ క్లాస్ తప్పనిసరిగా ఉండేలా చేస్తాను. పీటీ (ఫిజికల్ ట్రైనింగ్) క్లాస్ బదులు సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ ఏర్పాటు చేస్తాను. ఇటీవల విశాల్‌తో మాట్లాడినప్పుడు ఆయన కూడా ఇలానే అన్నారు. ఈ సిమిలర్ ఐడియాలజీనే మిమ్మల్ని ఫ్రెండ్స్‌ని చేసిందా? మావల్ల ఏదో ఓ మంచి జరగాలని కోరుకునే మనస్తత్వం ఉన్నవాళ్లం. సొసైటీ మీద బాధ్యత ఉన్నవాళ్లం. దారి ఏదైనా ఇద్దరి ఆలోచనా తీరు ఒక్కటే. మా ఫ్రెండ్షిప్ ఇంత బలంగా ఉండటానికి అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. వీ అండ్ వీ (విశాల్, వరలక్ష్మీ) రియల్ లైఫ్‌లో మంచి పెయిర్ అవుతుందని కోలీవుడ్‌లో టాక్ ఉంది? ఫ్రెండ్స్‌గా మేం మంచి జోడీ. మా మధ్యలో ఎటువంటి రొమాన్స్ లేదు. అయితే ఏదో ఉందని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్‌గా ఉన్నారంటే వాళ్ల మధ్య ఉన్నది రొమాన్సే.. ఇంకేం కాదు అని నిర్ణయానికి వచ్చేస్తారు. ఈ ధోరణి కూడా మారాలి. మేం డేటింగ్ చేసుకోవడంలేదు. ఫ్రెండ్స్‌గా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకసారి నటీనటుల సంఘం ఎలక్షన్స్ అప్పుడు మీ ఫాదర్ శరత్‌కుమార్, మీ బెస్ట్ ఫ్రెండ్ విశాల్ మధ్య పోటీ జరిగితే ఇబ్బందిపడ్డారా? అప్పుడు ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. మా నాన్నగారికే నేను సపోర్ట్ చేస్తున్నానని. విశాల్ ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండే. కానీ నేను మా నాన్నగారినే సపోర్ట్ చేస్తాను. ఒకవేళ మీ ఫాదర్ సైడ్ తప్పు... మీ బెస్ట్ ఫ్రెండ్‌ది కరెక్ట్ అయితే అప్పుడు ఎవరివైపు నిలబడతారు? మా నాన్నగారు చేస్తుంది ఏదైనా తప్పు అనిపిస్తే ఆయనతో ధైర్యంగా చెప్పగలను. చాలా సార్లు చెప్పాను కూడా. తప్పును నిర్మొహమాటంగా నిలదీయాలని నేర్చుకున్నాను. నా సోషల్ మీడియాలో పోస్ట్‌లు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్పు చేసినవాళ్లను బహిరంగంగా విమర్శించిన విషయం మీకు తెలుస్తుంది. నాన్నగారితో ఏదైనా ధైర్యంగా చెబుతానన్నారు. మరి.. ఆయన ఇంకో పెళ్లి (నటి రాధిక) చేసుకున్నారని ఎప్పుడైనా ఆగ్రహం వ్యక్తం చేశారా? కోపాన్ని మనసులోనే దాచుకునే టైప్ కాదు. అప్పుడే కోప్పడ్డాను. ఇద్దరు కలిసి ఉండలేకపోతే విడాకులు తీసుకోవడం ఇప్పుడు చాలా సాధారణం అయిపోయింది. కానీ అప్పట్లో చాలా తక్కువ. భార్య, భర్త ఆనందంగా ఉండలేనప్పుడు విడిపోవడమే నయం. కలిసి ఉండి కొట్టుకుంటుంటే అది పిల్లల్ని కష్టపెడుతుంది. మా అమ్మానాన్న విడివిడిగా ఉంటూ బెటర్ పేరెంట్స్ అయ్యారు. ఏది జరిగినా మంచికే అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. అప్పుడు అలా జరగబట్టే ఈ రోజు నేను ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నానని అనుకుంటున్నాను. మీ లైఫ్ పార్ట్నర్లో ఎలాంటి లక్షణాలు ఆశిస్తున్నారు? ఇంకా పుట్టలేదేమో (నవ్వుతూ). నచ్చే క్వాలిటీస్ అంటే.. తనని తాను సెక్యూర్డ్‌గా ఉంచుకోగలిగేవాడు. నా ఎదుగుదలను చూసి ఫీల్ అయ్యేవాడు నాకొద్దు. పెళ్లి ఎప్పుడు? పెళ్లి నా యాంబిషన్ కాదు. స్టేట్‌కి సీఎం అవ్వడం నా లక్ష్యం. మ్యారేజ్‌కి మీరు వ్యతిరేకమా? వ్యతిరేకం అని కాదు. పెళ్లి అనేది కచ్చితంగా చేసుకొని తీరాలి అని కాదు. ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీస్‌తో నా గ్రోత్‌ని చూసి భయపడకుండా, పెళ్ళి తర్వాత ఇంట్లో కూర్చో అని అనకుండా ఉంటే పెళ్లి చేసుకుంటా. పెళ్లి తర్వాత భర్త జాబ్ మానేయమంటే మనం ఎందుకు మానేయాలి? – డి.జి. భవాని -
నేనంటే హడల్!
చిత్రపరిశ్రమలోని వారు తనంటే భయపడుతున్నారు అంటోంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్. ఈ అమ్మడిని సినీరంగంలో ఈ తరం డేరింగ్ లేడీ అని చెప్పవచ్చు. తన మనసుకు అనిపించింది ధైర్యంగా చెబుతూ భావ స్వేచ్ఛను బాగా వాడుకుంటున్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్. నటిగా హీరోయిన్ పాత్రలనే చేస్తానని అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా ఎలాంటి పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని ఆల్‌రౌండర్ నటిగా పేరు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం వరలక్ష్మి నటిస్తున్న చిత్రాల్లో విలనిజం ప్రదర్శించే చిత్రాలు చోటుచేసుకున్నాయి. అలాంటి వాటిలో పందెంకోడి 2 ఒకటి. విశాల్ హీరోగా నటించి తన నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో కీర్తీసురేశ్ హీరోయిన్గా నటించగా వరలక్ష్మీశరత్‌కుమార్ ప్రతినాయకి పాత్రను పోషించింది. ఈ పాత్రను ఆమె అదరగొట్టిందంటున్నారు. ఈ చిత్రం ద్వారా ఈ సంచలన నటి టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. పందెంకోడి 2 చిత్రం తనకు చాలా ముఖ్యమైనదంటున్న వరలక్ష్మీశరత్‌కుమార్ తాజాగా దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న మీటూ గురించి స్పందిస్తూ దీని గురించి ఇప్పుడు జరుగుతున్న అవగాహన వంటి కార్యక్రమాన్ని తాను ఏడాది క్రితమే సేవ్ శక్తి పేరుతో ప్రారంభించానని చెప్పింది. తాను ఎవరికీ భయపడనంది. ఏ విషయం గురించి అయినా తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెబుతానని అంది. అదే విధంగా తప్పు చేసిన వారు ఎవరైనా అందుకు తగిన శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొంది. అరబ్ దేశాల తరహాలో శిక్ష విధానాన్ని ఇక్కడ తీసుకొస్తే మహిళలపై జరిగే అత్యాచారాలు తగ్గుతాయని అంది. ఇకపోతే తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయడం, తన ధైర్యం వంటి చర్యల కారణంగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేక మర్యాద, తనను చూస్తే భయం ఉందని భావిస్తున్నానని వరలక్ష్మి పేర్కొంది. ఇది తన నిజాయితీదక్కిన ఫలంగా భావిస్తానని ఈ జాణ అంటోంది. వరలక్ష్మి విలనిజం ప్రదర్శించిన పందెంకోడి 2 చిత్రం గురువారం విడుదల కానుంది.ఇక విజయ్‌తో ఢీ కొంటున్న సర్కార్ చిత్రం దీపావళి పండగకు పేలనుంది. ఇవి కాకుండా మరో అరడజను వరకూ చిత్రాలు వరలక్ష్మీ చేతిలో ఉన్నాయి. -
మేలుకో మహిళా.. లేదంటే భద్రత కలే!
నేటి సమాజంలో మహిళలకు భద్రత ఏది? అనే అంశంపై మూడు రోజులుగా చిత్రపరిశ్రమలో చర్చ జరుగుతోంది. హీరోయిన్ భావన కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. నటీమణుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వ్యక్తులను శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమిళ హీరోయిన్ వరలక్ష్మీ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ఇంతకీ వరలక్ష్మీ ఏం చెప్పారంటే.. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో నిజాయితీగా మాట్లాడిన ప్రతి మాటను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే, నా అనుభవాన్ని బయటపెట్టాలా? వద్దా అని రెండు రోజులు తర్జనభర్జన పడ్డాను. చివరికి నా మానసిక సంఘర్షణను పంచుకోవాలనుకున్నాను. ఓ టీవీ ఛానల్ ప్రోగ్రామింగ్ హెడ్‌తో ఓసారి సమావేశమయ్యాను. సమావేశం ముగుస్తుందనగా ‘‘ఇంకేంటి! మనం బయట ఎప్పుడు కలుస్తున్నాం?’’ అనడిగాడు. నేను ‘‘మరో పని ఏమైనా ఉందా?’’ అనడిగా. కొంటెగా చూస్తూ.. ‘‘నో.. నో.. పనేం లేదు. ఫర్ అదర్ థింగ్స్’’ అన్నాడు. నా కోపాన్ని అణుచుకుని ‘‘సారీ! మీరు దయ చేయవచ్చు. ప్లీజ్’’ అన్నాను. ‘‘అంతేనా’’ అని నవ్వుతూ బయటకు నడిచాడు.ఇటువంటి ఘటనల గురించి చెప్పినప్పుడు చిత్రసీమలోని వ్యక్తులతో పాటు బయట వ్యక్తుల నుంచి వచ్చే కామన్ రియాక్షన్... ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంతే. ఇందులోకి ప్రవేశించేటప్పుడు నీకు ఇవన్నీ తెలుసు. ఇప్పుడెందుకు కంప్లైంట్ చేస్తున్నావ్?’’ అంటుంటారు. అలాంటి వాళ్లకు చెప్పేది ఒక్కటే... ‘‘ఎలాంటి భావోద్వేగాలు లేని ఓ మాంసపు ముక్కలా నన్ను ట్రీట్ చేస్తారనో లేదా ఇక్కడి మహిళలకు ఇలాంటివి కామన్.. అనుసరించిపోవాలనో నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రాలేదు. ఐ లవ్ యాక్టింగ్. ‘వీలైతే ఎదుర్కొందాం.. లేదా వదిలేద్దాం’ అనుకోవడంలేదు. ( హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు ) నా ప్రొఫెషన్ని ఎప్పటికీ వదలను.ఓ మహిళగా మగాళ్లకు ఓ సూచన చేస్తున్నా. ‘‘మహిళలను అగౌరవపరచడం మానుకోండి లేదా బయటకు వెళ్లండి’’. నేనో హీరోయిన్. స్క్రీన్‌పై గ్లామరస్‌గా కనిపిస్తా. అంతమాత్రాన నన్ను అగౌరవపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది నా లైఫ్, నా బాడీ, నా ఇష్టం. ఏ మగాడికీ నన్ను తక్కువగా చూసే హక్కు లేదు. ‘‘నీ లైఫ్‌లో జరిగింది చిన్న ఘటనే కదా. ఎందుకింత రాద్దాంతం చేస్తున్నావ్?’’ అని అడగొచ్చు. నిజమే, ఘటన చిన్నదే. లక్కీగా, నేను సేఫ్‌గానే బయటపడ్డా. మహిళలు ఎలా మాట్లాడాలో.. ఏ బట్టలు వేసుకోవాలో.. ఎలా ప్రవర్తించాలో చెప్పడం బదులు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలో నేర్పాలి.మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, అగౌరవంగా చూడడం వంటివి నానాటికీ పెరుగుతున్నాయి. మన విద్యావ్యవస్థ మనల్ని ఫెయిల్ చేస్తోంది. భయంతో ఎవరైతే అమ్మాయిలు మాట్లాడలేకపోతున్నారో వాళ్ల తరఫున మాట్లాడుతున్నా. మగవాళ్లకు భయపడడం కాదు.. ధైర్యంగా బయటకొచ్చి మహిళలు మాట్లాడితేనే వాళ్లకు శిక్ష పడుతుంది.ఇప్పుడు మేలుకోకపోతే.. మహిళలకు భద్రత అనేది కలగానే మిగులుతుంది. ‘రేప్’ అనే పదాన్ని ఈ సమాజం నుంచి ఎప్పటికీ తొలగించలేం. -
మూడు రోజులుగా పొలంలో మహిళ దీక్ష
పిఠాపురం : కొత్తపల్లి మండలం కొండెవరంలో ఓ మహిళ తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తిలో వాటా ఇవ్వడం లేదంటూ ముగ్గురు పిల్లలతో పొలంలో మూడు రోజులుగా దీక్ష చేస్తోంది. సోమవారం తెలియవచ్చిన వివరాలిలా ఉన్నాయి. కొండెవరానికి చెందిన తోలుం రా ఘవమ్మకు నలుగురు కుమార్తెలు. ఆమెకు ఇల్లు, ఎకరంన్నర భూమి ఉంది. ఇంటిని చిన్న కూతురు పెంకే వరలక్ష్మికి కట్నంగా రాసిచ్చిన రాఘవమ్మ, ఎకరంన్నర భూ మిని మిగిలిన ముగ్గురు కుమార్తెలకు సమానంగా రాసిం ది. ఆ భూమిలో కూడా తనకు వాటా వస్తుందని తల్లిని వరలక్ష్మి అడిగింది. ఇల్లు ఇచ్చినందున భూమి ఇవ్వనని నిరాకరించడంతో తన తండ్రి ఆస్తి అయిన భూమిలో న్యాయంగా తనకు వాటా వస్తుందని, కావాలంటే తనకిచ్చిన ఇంటిని నాలుగు వాటాలు వేసి పంచాలని చెప్పిం ది. ఇప్పటికే కోత దశకు చేరుకున్న వరి పంటను కోస్తే తా ను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హె చ్చరించింది. పంటను కోయనీయకుండా అడ్డుతగులుతోందని రాఘవమ్మ కొత్తపల్లి పోలీసులను ఆశ్రయించిం ది. ఇద్దరినీ పిలిపించి మాట్లాడామని, సివిల్ కేసు కాబట్టి కోర్టులో తేల్చుకోవాలని చెప్పామని ఎస్సై చైతన్యకుమార్ తెలిపారు. మూడు రోజులుగా పొలం గట్టున తం డ్రి ఫొటో, కిరోసిన్ సీసా పెట్టుకుని తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని, దీక్షకు దిగింది. రాత్రులు పిల్లలను ఇంటికి పంపించి, తాను, భర్తా చేను గట్టునే ఉంటున్నామని ఆమె చెప్పింది. ముందు ఇల్లే కావాలని తీసుకున్న వరలక్ష్మి ఇప్పుడు రేట్లు పెరగడంతో భూమి కావాలని నాటకమాడుతోందని ఆమె తల్లి, అక్కలు ఆరోపిస్తున్నా రు. వరలక్ష్మి దీక్ష గురించి ఎస్సైని వివరణ కోరగా, తన కు ఈ విషయం తెలియదన్నారు. మహిళా కానిస్టేబుల్‌ను పంపి, ఆమెను పోలీస్‌స్టేషన్‌కు రప్పిస్తామని చెప్పారు. -
మాతృమూర్తి ఆశీస్సులందుకున్న రాజప్ప
ఉప్పలగుప్తం :పెద్దాపురం శాసనసభ్యునిగా ఎన్నికై నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఉపముఖ్యమంత్రిగా, హోంశాఖ, విపత్తుల నివారణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం తన స్వగ్రామమైన పెద్దగాడవిల్లిలో తన తల్లి కొండాయమ్మ ఆశీస్సులు అందుకున్నారు. రాత్రి తొమ్మిదిగంటల సమయంలో ఊరేగింపుగా వచ్చిన రాజప్పకు ఆయన సోదరి సుందరనీడి వరలక్ష్మి హరతి పట్టి ఇంట్లోకి స్వాగతించారు. తండ్రి రంగయ్య చిత్రపటం వద్ద రాజప్ప నివాళులర్పించారు. అనంతరం తల్లి దీవెనలందుకున్నారు. వేదపండితులు ఆశీర్వచనాలందించారు. భార్య అనూరాధ, కుమారుడు రంగనాథ్, సోదరులు బాపూజీ, సత్తిబాబు, జగ్గయ్యనాయుడు కుటుంబ సభ్యులందరూ ఒకొక్కరిగా రాజప్పకు శుభాకాంక్షలు తెలిపారు. రాజప్పకు రాజయోగం పట్టిందని గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చి మిఠాయిలు పంచారు. రాజప్ప తండ్రి వెంకట రంగయ్య ఎన్నికల సమయంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. -
సమస్యలు యథాత థం
సాక్షి, కాకినాడ : సుమారు మూడు నెలల అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారులకు వివరించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరూ స్థానికంగా లేకపోవడంతో అదనపు జాయింట్ కలెక్టర్ డి.మార్కండేయులు, డీఆర్వో బి.యాదగిరి గ్రీవెన్స్ నిర్వహించారు. ఎప్పటిలాగే రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ, ఉపాధి తదితర అంశాలపై అర్జీలు అందాయి. అదే విధంగా పదో తరగతిలో మార్కులు అధికంగా తెచ్చుకున్నామని, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ చదివేందుకు ఫీజులు, వసతి కల్పించాలని కోరుతూ యువత గ్రీవెన్స్‌లో అధికారులకు మొరపెట్టుకుంది. వాటిని పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కిందిస్థాయి అధికారులను ఏజేసీ, డీఆర్వో ఆదేశించారు. చేపల చెరువులు తవ్వేస్తున్నారు... తొండంగి మండలం ఏవీ నగరంలో ఊరి చుట్టూ చేపల చెరువులు తవ్వుతున్నారని దళితులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు వచ్చి ఆందోళన చెందారు. దళిత కాలనీని ఆనుకుని వున్న పంట భూముల్లో కొందరు పెద్దలు చెరువులు తవ్వి చేపలు ఏపుగా పెరగటం కోసం చుట్టు పక్కల ఏ జంతువు చచ్చినా తీసుకొచ్చి చెరువుల్లో వేస్తున్నారన్నారు. వాతావరణ కాలుష్యంతోపాటు దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటోందని వారు వాపోయారు. అనంతరం ఏజేసీకి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఏడెకరాల చెరువుందని, మరో పదకొండు ఎకరాల చెరువు తవ్వుతుండగా ఇంకా కొత్త చెరువుల ఏర్పాటుకు కొందరు పెద్దలు ప్రణాళికలు వేశార ని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేలిముద్ర పడడం లేదని పింఛను కట్ ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన దిడ్డి వరలక్ష్మి వికలాంగురాలు. ఆమెకు ప్రతి నెలా రూ. 500 పింఛను వచ్చేది. ఉపాధి కూలీ కూడా పనికి తగ్గ వేతనం అందుకునేది. ఆమె చేతి వేళ్ల ముద్రలు సరిగా పడకపోవడంతో మూడు నెలల నుంచి పింఛను అందడం లేదు. ఉపాధి హామీ కూలీ కింద పోస్టాఫీసులో ఏడాది నుంచి సొమ్ము అందడం లేదు. తన తండ్రితో పాటు కలెక్టరేట్‌కు వచ్చిన వరలక్ష్మి అధికారులకు వినతిపత్రం అందించి న్యాయం చేయాలని కోరింది. అలాగే మరిన్ని ముఖ్య సమస్యలపై పలువురు అర్జీలు అందజేశారు. వాటిని పరిశీలించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.