నచ్చినోడు కంట పడలేదు! | Actress Anjali Shock gave me that I did not like it yet. | Sakshi
Sakshi News home page

నచ్చినోడు కంట పడలేదు!

Published Sun, Sep 10 2017 4:13 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

నచ్చినోడు కంట పడలేదు! - Sakshi

నచ్చినోడు కంట పడలేదు!

తమిళసినిమా: నచ్చినోడు నాకు ఇంకా కంటపడలేదు అంటూ నటి అంజలి షాక్‌ ఇచ్చింది. ఇది ఎవరికి షాక్‌ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు చాలా మందికి తెలుసు. అంజలి నట కెరీర్‌ను ప్రారంభించి చాలా ఏళ్లే అయ్యింది. అదే విధంగా చాలా చిత్రాలు చేసింది. మంచి పేరును సంపాదించుకుంది. అయితే తెలుగులో వెంకటేశ్, బాలకృష్ణలాంటి ప్రముఖ హీరోలతో జత కట్టినా అక్కడ స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను తెచ్చుకోలేదు. ఇక కోలీవుడ్‌లో అది కూడా లేదు.

ఇప్పటికీ స్టార్‌ హీరోలతో నటించే అవకాశాన్ని పొందలేక పోయింది. అయితే అవకాశాలను మాత్రం ఈ రెండు భాషల్లోనూ వరుసగా అందుకుంటూనే ఉంది. ఇప్పుడు అదనంగా మలయాళంలోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకునే ప్రయత్నంలో ఉంది. నటిగా ఇలా ఉంటే అంజిలి చాలాసార్లు వదంతుల్లో చిక్కుకుంది. ముఖ్యంగా నటుడు జైతో ప్రేమ, షికార్లు అంటూ ప్రచారం జోరుగానే జరుగుతోంది.

ఆ మధ్య జై తన స్వహస్తాలతో దోసెలు వేసిపెడితే లొట్టలేసుకుని తిని ఆయనలో మంచి నలభీముడున్నాడంటూ కితాబిచ్చేసింది కూడా. అంతే కాదు జై పుట్టిన వేడుకల్లో ప్రత్యేకంగా పాల్గొని సందడి చేసింది. దీంతో ఈ జంట గురించి చాలా గాసిప్స్‌ హల్‌చల్‌ చేశాయి. ఇక నటుడు జై కూడా తాను నటి అంజలిని పెళ్లి చేసుకోవచ్చునని అన్నట్లు ప్రచారం జరిగింది. ఇంత జరుగుతున్నా తాజాగా నటి అంజలి తనకు నచ్చినోడు ఇంకా తారసపడలేదని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

ఒక భేటీలో నటి అంజలి మాట్లాడూతూ తన సినీపయనం హ్యాపీగా సాగుతోందని పేర్కొంది. కాబట్టి ప్రేమ,పెళ్లి వంటి అంశాల గురించి ఆలోచించే తీరిక తనకు లేదని అంది. అయినా తన మనసుకు నచ్చినోడు ఇంకా తారస పడలేదని అంది. పోతే తనను పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు  జై అన్నట్లు తనకు తెలియదని చెప్పింది.ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలానే జరుగుతుందనే వేదాంతాన్ని వల్లించింది.

కాగా తాను రాజకీయరంగప్రవేశం చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. తాను ఢిల్లీలో పార్లమెంట్‌ను తిలకించిన విషయం నిజమేనని, దీంతో  రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం చేసేశారని, నిజానికి అలాంటి ఆలోచన  లేదని అంజలి పేర్కొంది. అంజలికి, నటుడు జై కీ మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చాయా? అందుకర్థాయనకి షాక్‌ ఇవ్వడానికి తనకు నచ్చినోడు తారస పడలేదని పేర్కొందా? అన్న విషయాలు నటుడు జై నోరు విప్పితే గానీ తెలియదు. అంజలి, జై కలిసి నటించిన బెలూన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement