రాజకీయ నేపథ్యంలో జయ్ చిత్రం | jai new movie is based on political drama | Sakshi
Sakshi News home page

రాజకీయ నేపథ్యంలో జయ్ చిత్రం

Nov 21 2013 3:57 AM | Updated on Sep 17 2018 4:56 PM

రాజకీయ నేపథ్యంలో జయ్ చిత్రం - Sakshi

రాజకీయ నేపథ్యంలో జయ్ చిత్రం

రాజకీయ నేపథ్య చిత్రం అనగానే వద్దు బాబోయ్ అని హీరోలు పారిపోతున్నారు. అలాంటిది సుబ్రమణ్యపురం, ఎంగేయుమ్ ఎప్పోదుమ్, రాజారాణి వంటి ప్రేమ కథా చిత్రాల్లో

రాజకీయ నేపథ్య చిత్రం అనగానే వద్దు బాబోయ్ అని హీరోలు పారిపోతున్నారు. అలాంటిది సుబ్రమణ్యపురం, ఎంగేయుమ్ ఎప్పోదుమ్, రాజారాణి వంటి ప్రేమ కథా చిత్రాల్లో నటించిన యువ నటుడు జయ్ తాజాగా రాజకీయ కథా చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇంతకు ముందు ఉదయం ఎన్‌హెచ్ 4 చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు మణిమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ నటుడు జయ్‌తో తాను చేస్తున్న తొలి చిత్రం ఇదేనన్నారు. దీనికి పొడియన్ అనే టైటిల్‌ను నిర్ణయించామన్నారు. షూటింగ్ జనవరి నుంచి ప్రారంభంకానుందన్నారు. తమిళంలో చిన్న పిల్లల్ని పొడియన్ అని పిలుస్తారని తెలిపారు. ఇకపై పిల్లల్ని పొడియన్ అని ఎవరూ పిలవరని, స్నేహం, రాజకీయ నేపథ్యమున్న చిత్రం పొడియన్ అని దర్శకుడు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement