జయ్‌తో శృతి హాసన్?
జయ్‌తో శృతి హాసన్?
Published Thu, Apr 10 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
యువ నటుడు జాయ్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్న క్రేజీ నటి శృతి హాసన్. ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటంటే, చెన్నై - 28 కుర్రాడి దశ మారిందని. తొలుత ఈయన సినీ కెరీర్ కాస్త తడబడినా ఎంగేయుం ఎప్పోదుం చిత్రంతో మంచి హిట్ కొట్టారు. ఆ తరువాత చిత్రాల ఎంపిక విషయంలో కాస్త ఆచితూచి అడుగేస్తున్న జయ్ కొంచెం గ్యాప్ తరువాత నటించిన రాజారాణి మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రంలో సంచలన తార నయనతారతో జత కట్టిన జయ్‌కి తాజాగా యమా క్రేజీ నటి శృతి హాసన్‌తో రొమాన్స్ చేసే లక్కీ అవకాశం చాలా దగ్గర్లో ఉన్నట్లు తాజా సమాచారం. ఈ సరికొత్త కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి జగజాలన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజాకు దగ్గర బంధువైన పార్తి భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత స్వరాలు అందించనున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్ టెయినర్ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. జయ్ సరసన శృతి హాసన్‌ను నటింప జేయడానికి కారణం కథ డిమాండ్ మేరకేనని యూనిట్ వర్గాలంటున్నారుు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా ప్రకాశిస్తున్న శృతి హాసన్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అన్నది తెలియాల్సి ఉంది. త్వరలో ఈ బ్యూటీ హరి దర్శకత్వం వహిస్తున్న పూజై చిత్రంలో విశాల్‌తో డ్యూయెట్లు పాడేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు, హిందీ భాషలలో విజయాలను రుచి చూసిన శృతిహాసన్ తమిళంలో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.
Advertisement
Advertisement