నటుడు జైను విచారిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
పెరంబూరు: యువ నటుడు జై మరోసారి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. గత 2014 ఏప్రిల్ 13న స్థానిక కేకే.నగర్ సమీపంలోని కాశి థియేటర్ ప్రాంతంలో మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్ వాహనాన్నే ఢీకొట్టాడు. అదే విధంగా 2017 సెప్టెంబరు 21న మద్యం తాగి వేగంగా కారు నడుపుతూ అడయారు బ్రిడ్జ్ సమీపంలో గొడను ఢీకొట్టాడు. ఈ కేసులో పోలీసులు అతనికి జరిమానా విధించి 6 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు.
తాజాగా మంగళవారం రాత్రి నుంగంబాక్కమ్ ప్రధానరోడ్డులో అధిక ధ్వనితో సైరన్ మోగించుకుంటూ వెళ్లడంతో ఇతర వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంత ట్రాఫిక్ పోలీసులు జై కారును వెంబడించి అడ్డుకున్నారు. కారులో ఉన్న జైతో పోలీసులు మాట్లాడుతూ అధిక ధ్వనితో హారన్ మోగించడం నేరమని, ఆస్పత్రి సమీపంలో శబ్దం చేసుకుంటూ వెళితే రోగులు, వృద్ధులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సూచించారు. ధ్వని కాలుష్యానికి కారణమైన వారిపై తీసుకునే చర్యల గురించిన అవగాహన వీడియోను చూపించారు. దీంతో నటుడు జై ఇకపై అలా చేయనని సారీ చెప్పడంతో పోలీసులు హెచ్చరించి వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment