
సాక్షి, తమిళ సినిమా: యువ నటుడు జై హీరోగా నటించడానికి రెడీ అవుతున్న తాజా చిత్రం జరుగండి. మరో నటుడు నితిన్‌సత్య స్వేద్ చిత్ర నిర్మాణ సంస్థ, బద్రి కస్తూరి శ్రద్ధ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో కలిసి నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా పిచ్చుమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జై సరసన నటి వెబాజాన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఇందులో రోబోశంకర్, డేనీ, చిరుతై అమిత్, ఇళవరసు, మమ్‌గోపీ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. బోబోశశి సంగీతాన్ని, ఆర్‌వీ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన నితిన్‌సత్య మాట్లాడుతూ.. దర్శకుడు పిచ్చుమణి కథను రెడీ చేసిన తరువాత దీనికి నప్పే టైటిల్ మాత్రమే కాకుండా మనసుకు హత్తుకునే విధంగా ఉండాలని ఆలోచించి 'జరుగండి' టైటిల్‌ను నిర్ణయించామని చెప్పారు.
ఇది వేరే భాషా టైటిల్ మాదిరిగా ఉన్నా తమిళంలోనూ ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారని అన్నారు. కథల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వైవిధ్యకథా చిత్రాలను చేసుకుంటూపోతున్న నటుడు జైకి ఈ చిత్రం తన కేరీర్‌లో ముఖ్య చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు పిచ్చుమణి అంత జనరంజకమైన కథ, కథనాలను తయారు చేశారని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని నితిన్‌సత్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment