
వచ్చే ఏడాది డుండుండు..పీపీపీనే
సినీ జంటలు ప్రేమించు కోవడం, ఆ విషయం మీడియాలో వెలుగు చూడడంతో అబ్బే అలాంటిదేమీలేదు.
సినీ జంటలు ప్రేమించు కోవడం, ఆ విషయం మీడియాలో వెలుగు చూడడంతో అబ్బే అలాంటిదేమీలేదు. తాము మంచి ఫ్రెండ్స్ అంతే అంటూ బుకాయించడం మామూలే. అలాంటి వారే ఆ తరువాత పెళ్లి చేసుకుని కాపురాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం అలాంటి ప్రచారానికి కేంద్రబిందువుగా మారిన వారిలో నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌శివల జంట ఒకటి. వీరిద్దరి గురించి చాలా కాలంగా చాలా ప్రచారమే జరుగుతోంది. కలిసి సహజీవనం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.సరిగ్గా ఇలాంటి మరో జంటే నటుడు జయ్, అంజలి.వీరిద్దరూ కలిసి ఎంగేయుం ఎప్పోదుం చిత్రంలో నటించారు.
ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారిందని కోలీవుడ్ చెవులు కొరిక్కుంది.అయితే షరా మామూలుగానే నటి అంజలి, నటుడు జయ్ ఇద్దరూ మత మధ్య అలాంటిదేమీలేదని ఖండించారు. అలాంటిది ఇటీవల జయ్ అంజలికి స్వయంగా దోసెలు వేసి తినిపించిన ఫొటోలు వారే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ ప్రేమ బంధాన్ని చాటుకున్నారు. ఈ జంట ఇప్పటికే సహజీవనం చేస్తున్నారనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది.అంతే కాదు పెళ్లికి సిద్ధం అవుతున్నారన్నది తాజా వార్త.నటి అంజలి జయ్‌తో ప్రేమ వ్యవహారాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పి పెళ్లికి ఒప్పించినట్లూ, జయ్ కూడా వెంటనే పెళ్లికి రెడీ అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే అంజిలి మాత్రం పెళ్లికు ఇప్పుడే తొందర పడవద్దని ఆయనతో చెప్పినట్లు టాక్. ప్రస్తుతం అంజలి తరమణి, కాన్‌బదు పొయ్, పేరంబు, బెలూన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.వీటిలో బెలూన్ చిత్రంలో జయ్‌తో కలిసి నటిస్తున్నారు.ఈ చిత్రాలను పూర్తి చేసి వచ్చే ఏడాది జయ్‌తో ఏడడుగులు వేయడానికి అంజలి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం.