ఐదేళ్ల క్రితం రిలీజ్ అయిన జర్నీ సినిమాతో ఆకట్టుకున్న జై, అంజలిల జోడి ఇంత కాలం తరువాత మరో సారి తెరమీద కనిపించనుంది. జర్నీ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన ఈ జంట తరువాత ఎవరికి వారు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని బిజీ అయ్యారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. అయితే తాజాగా దర్శకుడు సినీష్ ఈ సక్సెస్ ఫుల్ జోడిని మరోసారి వెండితెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్కు కేరాఫ్ అడ్రస్గా మారిన రొమాంటిక్ హర్రర్ జానర్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బుధవారం లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. ఎలాంటి అంచనాల్లే కుండా తెరమీదకు వచ్చిన జర్నీ సినిమాతోనే మంచి వసూళ్లను సాధించిన జై, అంజలిల జంట.. కొత్త సినిమాతో మరోసారి ఆకట్టుకుంటుందేమో చూడాలి.
My next untitled Tamil film shooting starts frm today with J @Actor_Jai #After5yrs #romantichorror #NewBeginnings
— Anjali (@yoursanjali) 6 July 2016