ఐదేళ్ల తరువాత కలిసి నటిస్తున్నారు
ఐదేళ్ల క్రితం రిలీజ్ అయిన జర్నీ సినిమాతో ఆకట్టుకున్న జై, అంజలిల జోడి ఇంత కాలం తరువాత మరోసారి తెర మీద కనిపించనుంది. జర్నీ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన ఈ జంట తరువాత ఎవరికి వారు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని బిజీ అయ్యారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. అయితే తాజాగా దర్శకుడు సినీష్ ఈ సక్సెస్ ఫుల్ జోడిని మరోసారి వెండితెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్కు కేరాఫ్ అడ్రస్గా మారిన రొమాంటిక్ హర్రర్ జానర్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బుధవారం లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. ఎలాంటి అంచనాల్లే కుండా తెరమీదకు వచ్చిన జర్నీ సినిమాతోనే మంచి వసూళ్లను సాధించిన జై, అంజలిల జంట.. కొత్త సినిమాతో మరోసారి ఆకట్టుకుంటుందేమో చూడాలి.