యంగ్‌ హీరోకి బంపర్‌ ఆఫర్‌ | Jiiva to Make his Bollywood Debut With Ranveer Singh 83 | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 13 2019 10:09 AM | Last Updated on Sun, Jan 13 2019 10:09 AM

Jiiva to Make his Bollywood Debut With Ranveer Singh 83 - Sakshi

కోలీవుడ్‌ యువ నటుడు జీవాకు బాలీవుడ్‌ బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. కో వంటి మంచి కథా చిత్రం పడితే రెచ్చిపోయే నటుడు జీవా. ఇటీవల ఈయన నటించిన కలగలప్పు 2 మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం జిప్సీ, గొరిల్లా చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతున్నాయి. తన సొంత నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ 90వ చిత్రంలో జీవా హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారు. తాజా సమాచారం ఏమిటంటే ఈ యువ నటుడికి బాలీవుడ్‌ కాలింగ్‌ బెల్‌ కొట్టింది.

రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌ బాలీవుడ్‌ చిత్రంలో జీవా నటించబోతున్నారు. ముందుగా ఈ పాత్రలో సంచలన నటుడు విజయ్‌ దేవరకొం‍డ కనిపించనున్నారన్న టాక్‌ వినిపించింది. అయితే విజయ్‌ నో చెప్పటంతో ఆఫర్‌ జీవా తలుపు తట్టింది. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ‘1983 వరల్డ్‌ కప్‌ అనే చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి నటించబోతున్నాను. బాహుబలి చిత్రం ఎలాగైతే సిల్వర్‌స్క్రీన్‌పై బ్రహ్మాండాన్ని ఆవిష్కరించిందో అదే తరహాలో ఈ చిత్రం ఉంటుంది. నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఆ క్రీడ నేపథ్యంలో తొలిసారిగా బాలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు కెమెరా ముందు నిలబడదామా అన్నంత ఉత్సాహంతో ఉన్నాను.

1983లో వరల్డ్‌కప్‌ గెలిచి ఇండియాకు ఘనతను తెచ్చి పెట్టిన సంఘటనే ఈ చిత్ర ఇతివృత్తం. చిత్ర షూటింగ్‌ మే మాసంలో లండన్‌లో ప్రారంభమై 100 రోజుల పాటు చిత్రీకరణను జరుపుకోనుంది. అందుకు నేను ఇప్పటి నుంచే తయారవుతున్నాను. అప్పట్లో ఆ క్రికెట్‌ టీమ్‌లో ప్రముఖ క్రీడాకారుడిగా రాణించిన కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రలో నేను నటించనున్నాను. ఆయన పాత్రలో నటించడం గర్వంగా ఉంది. ప్రముఖ బౌలర్‌ చందు ఇంటికి వచ్చి నాకు శిక్షణ ఇస్తున్నార’ని తెలిపారు.  ఎంఎస్‌.ధోని, లగాన్‌ చిత్రాల వరుసలో ఈ 1983 వరల్డ్‌ కప్‌ చిత్రం చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement