నేను సైతం స్వచ్ఛభారత్‌లో | Hansika's Next Film Opposite Jiiva, As Swachh Bharat | Sakshi
Sakshi News home page

నేను సైతం స్వచ్ఛభారత్‌లో

Published Thu, Aug 6 2015 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

నేను సైతం  స్వచ్ఛభారత్‌లో

నేను సైతం స్వచ్ఛభారత్‌లో

 స్వచ్ఛభారత్‌కు నేను సైతం అంటూ సిద్ధం అవుతున్నారు నటి హన్సిక. ప్రధాని ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ పథకం చాలా మట్టుకు ప్రచారానికే పరిమితం అయ్యిందనే ఆరోపణలు ఎదురవ్వుతున్న నేపథ్యంలో నటి హన్సిక గొడవేంటంటారా? అయితే ఆమె స్వచ్ఛభారత్‌కు నేను సైతం అంటోంది రియల్ లైఫ్‌లో కాదు లెండి. రీల్‌లైఫ్‌లోనే. విషయం ఏమిటంటే ఈ క్రేజీ బ్యూటీ తాజాగా నటుడు జీవాతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఇటీవల విజయాల్లో వెనుకబడ్డ జీవా ఇప్పుడు చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నయనతారతో తిరనాళ్ చిత్రంతో పాటు కవలైవేండామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
 
  ఇందులో కీర్తీసురేష్ ఆయనతో డ్యూయెట్లు పాడుతున్నారు. ఇప్పుడు జీవా మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు. దర్శకుడు రామ్‌ప్రకాష్ రాయప్ప దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో హన్సిక నాయికగా ఎంపికైంది. దీని గురించి ఆమె తెలుపుతూ దర్శకుడు చెప్పిన కథ వైవిధ్యంగా ఉందని తెలిపారు.  ఇందులో తన పాత్ర చాలా హ్యుమరస్‌గా ఉండడంతో అంగీకరించినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్ వలెంట్రీ యువతిగా  నటించనున్నట్లు చెప్పారు. ఈమె ప్రస్తుతం అరణ్మణై-2లో నటిస్తున్నారు.తదుపరి నటించే చిత్రం జీవాతోనేనని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement