Yatra 2: పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో సీఎం జగన్‌ లుక్‌ రిలీజ్‌ | AP CM YS Jagan Mohan Reddy Birthday Special, Yatra 2 Movie Poster Released | Sakshi
Sakshi News home page

Yatra 2: సీఎం వైఎస్‌ జగన్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘యాత్ర 2’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్

Published Thu, Dec 21 2023 10:33 AM | Last Updated on Thu, Dec 21 2023 10:52 AM

AP CM YS Jagan Mohan Reddy Birthday Special, Yatra 2 Movie Poster Released - Sakshi

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ యాత్ర. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర 2. ఇందులో వైఎస్సార్‌ తనయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని చూపించబోతున్నారు. గురువారం (డిసెంబర్‌ 21) వైఎస్‌ జగన్‌ బర్త్‌డేను పురస్కరించుకుని యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. 'నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకుని' అని పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను పోస్టర్‌లో జత చేశారు. ఈ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ సినిమాలో వైఎస్సార్‌ పాత్రలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి నటిస్తుండగా వైఎస్‌ జగన్‌ పాత్రలో జీవా నటిస్తున్నారు. 'యాత్ర' ఫేమ్‌ మహి వి రాఘవ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

చదవండి: PVR మల్టీప్లెక్స్‌లను బాయ్​కాట్​​ చేసిన సలార్‌.. కారణం 'డంకీ' సినిమానే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement