RK Roja Congratulates Ram Charan And Upasana Konidela, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

RK Roja: చిరంజీవి తాత అయుండొచ్చు కానీ ఎప్పటికీ హీరోనే.. మంత్రి రోజా ట్వీట్‌

Published Wed, Jun 21 2023 5:29 PM | Last Updated on Wed, Jun 21 2023 5:51 PM

RK Roja Congratulates Ram Charan, Upasana - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌- ఉపాసనల దంపతులకు జూన్‌ 20న పండంటి పాప పుట్టింది. చిరంజీవికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజే చిన్నారి జన్మించడంతో సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందని మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులైన చరణ్‌ దంపతులకు బంధుమిత్రులు, సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాజాగా నటి, ఏపీ మంత్రి ఆర్కే రోజా వీరికి ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. 'తాత అయిన చిరంజీవిగారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎప్పుడూ యవ్వనంగా, శక్తివంతంగా ఉండే ఈ కుటుంబానికి సర్వశక్తిమంతుడైన భగవంతుడు మెగా ప్రిన్సెస్‌ రూపంలో ఆశీర్వాదాన్ని అందించాడు. రామ్‌చరణ్‌.. చిన్నప్పుడు నిన్ను నా చేతుల్లో హత్తుకున్న రోజులు నాకింకా గుర్తున్నాయి. ఇప్పుడు నీకు పాప పుట్టిందన్న వార్త విని చాలా సంతోషమేసింది. చిరంజీవి సర్‌, మీరు తాతయ్య అయినప్పటికీ మాకు మాత్రం ఎప్పటికీ హీరోనే! ఉపాసన.. మీ ఇంటి చిన్ని మహాలక్ష్మికి ఇవే నా ఆశీస్సులు' అని ట్వీట్‌ చేశారు.

చదవండి: ప్రేమ పెళ్లి.. భర్త అసభ్య సందేశాలు పంపుతున్నాడంటూ నటి ఫిర్యాదు
ప్రేమలో నాకవి నచ్చవు, అయినా.. ఏది పడితే దాన్ని లవ్‌ అనేస్తున్నారు: రకుల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement