ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి.. ఫోటోలు షేర్‌ చేసిన రోజా | RK Roja Attend Ghattamaneni Damini Pre Wedding And Takes Selfie With Mahesh Babu; See Photos - Sakshi
Sakshi News home page

ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి.. మహేశ్‌బాబుతో రోజా సెల్ఫీ

Published Sat, Sep 2 2023 11:54 AM | Last Updated on Sat, Sep 2 2023 12:53 PM

RK Roja Attend Ghattamaneni Damini Pre Wedding And Takes Selfie With Mahesh Babu - Sakshi

ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు దగ్గరి బంధువు ఘట్టమనేని వర ప్రసాద్‌- అపర్ణ దంపతుల కూతురు డాక్టర్‌ దామిని పెళ్లిపీటలెక్కింది. డాక్టర్‌ సునీల్‌ కోనేరు- రాధికల పెద్ద కుమారుడు డా.సేతు సందీప్‌తో వైవాహిక జీవితాన్ని ఆరంభించనుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో వీరి ప్రీవెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు మహేశ్‌బాబు దంపతులు విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. సంగీత దర్శకుడు కీరవాణి సహా పలువురు సినీ సెలబ్రిటీలు ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు. అలాగే సీనియర్‌ నటి, ఏపీ మంత్రి రోజా సహా పలువురు రాజకీయ నేతలు సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రోజా, మహేశ్‌బాబు కాసేపు సరదాగా ముచ్చటించారు. అలాగే సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ ఫోటోలను రోజా ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకోగా అవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి: ప్రముఖ డైరెక్టర్‌ చేతిలో తిట్లు తిన్న హీరోయిన్‌.. కానీ ఆయన కాళ్లపై పడి వేడుకోలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement