anshu mallika
-
కూతురి సినీ ఎంట్రీపై స్పందించిన రోజా
ఏపీ పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖామంత్రి, సీనియర్ నటి రోజా కూతురు అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! త్వరలో ఆమె ఓ హీరో తనయుడి సరసన నటించనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ రూమర్స్‌పై రోజా నోరు విప్పారు. గురువారం నాడు రోజా బర్త్‌డే కావడంతో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'యాక్టింగ్ చేయడం తప్పని నేనెప్పుడూ చెప్పను. నా కూతురు, కొడుకు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కూతురికి బాగా చదువుకుని సైంటిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఉంది. తను చదువు మీదే దృష్టిపెట్టింది. ప్రస్తుతానికైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదు. ఒకవేళ సినిమాల్లోకి వస్తే మాత్రం ఒక తల్లిగా, ఒక హీరోయిన్గా ఆశీర్వదిస్తాను. తనకు అండగా నిలబడతాను' అని చెప్పుకొచ్చారు. చదవండి: నా పేరు సూర్య.. ఫస్ట్ చాయిస్ ఎవరో తెలుసా? రాజ్ తరుణ్‌కు అహ నా పెళ్లంట వెబ్‌సిరీస్‌తో అయినా హిట్ దక్కేనా? -
రోజా కూతురి అరుదైన ఘనత.. పాపులర్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫొటో
టాలీవుడ్లో 90'లలో నటిగా, అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే రోజా సెల్వమణి. సెల్వమణితో వివాహం కాగా వారికి ఓ కూతురు అన్షు మాలిక, కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు. ఇప్పుడు ఆమె కూతురు అన్షు మాలిక కూడా తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకున్నారు. అన్షు మాలిక రైటర్, ప్రోగ్రామర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా సత్తా చాటడంతో యంగ్ సూపర్ స్టార్ అవార్డుకి ఎంపికయ్యారు. దీంతో ఇన్‌ప్లూయెన్సర్ యూకే మేగజైన్ ఆమె కవర్ ఫోటోను ప్రచురించింది. ఇలాంటి అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని అన్షు తెలిపింది. కాగా ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై సైతం క్వీన్ ఆఫ్ టాలెంట్‌గా ఆమె ఫొటో వేసిన సంగతి తెలిసిందే. చదవండి: విరిగిన వేలు.. నొప్పితోనే షూటింగ్ చేసిన అమితాబ్ Anshu Malika Roja Selvamani Awarded ‘Young Superstar' By Influencer Magazine UK | IMUK Awards: Oct 2021 | #anshumalikarojaselvamani #youngsuperstar | Influencer Magazine UKhttps://t.co/GvjAfqjaFd pic.twitter.com/tdnkS32xcS — Influencer Magazine UK (@influencer_uk) September 30, 2021 -
నగరి ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షు మాలిక బర్త్‌డే ఫొటోలు
-
‘టోక్యో’కు అన్షు, సోనమ్
అల్మాటీ (కజకిస్తాన్): ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో రెండో రోజు భారత్‌కు రెండు బెర్త్‌లు ఖరారయ్యాయి. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత యువ రెజ్లర్లు అన్షు మలిక్ (57 కేజీలు), సోనమ్ మలిక్ (62 కేజీలు) అద్భుతం చేశారు. హరియాణా రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల అన్షు, 18 ఏళ్ల సోనమ్ తమ విభాగాల్లో ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 57 కేజీల ఫైనల్లో అన్షు 4–7తో ఖాన్‌గోరుజుల్ బోల్డ్‌సైఖాన్ (మంగోలియా) చేతిలో ఓటమి చవిచూసి రజతం సాధించగా... 62 కేజీల ఫైనల్లో జియా లాంగ్ (చైనా)తో తలపడాల్సిన సోనమ్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో జియా లాంగ్‌కు స్వర్ణం, సోనమ్‌కు రజతం లభించాయి. అయితే మిగతా మూడు విభాగాల్లో భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. సీమా బిస్లా (50 కేజీలు) నాలుగో స్థానంలో నిలువగా... నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్‌కు చేరిన వారికి మాత్రమే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు లభిస్తాయి. -
వెండి తెరపైకి బుల్లిరోజా?
బుల్లి రోజా వెండి తెరపైకి రానున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళం, తెలుగు భాషల్లో 1990వ దశకంలో ప్రముఖ నాయకిగా వెలుగొందారు. ఈమె నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే తనను తమిళ తెరకు పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు ఆర్కె సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి గత శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. రోజా ఇటీవల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన కూతురు అన్షు మాళికతో కలసి ఉన్న ఫొటో ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమై పలువురిని విశేషంగా ఆకర్షించింది. దీంతో 12 ఏళ్ల అన్షు మాళికను సినిమాల్లో నటింప చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు మొదలెట్టారు. అన్షు మాళిక ఇప్పటికే బుల్లితెరపై బాలతారగా గుర్తింపు పొం దారు. దీంతో బాలతారగా ఆమెను పరిచయం చేయడానికి రోజా పచ్చజెండా ఊపినట్లు సమాచారం. కాబట్టి త్వరలోనే బుల్లి రోజాను వెండితెరపై చూడవచ్చన్నమాట. -
మామ్‌బినేషన్
డిజైనర్ కాలమ్! అమ్మాయి నట్టింట తిరుగాడుతుంటే అమ్మకు కనుల నిండా పండగ. అమ్మ-అమ్మాయి కలిసి ఒకే కాంబినేషన్ దుస్తులు ధరిస్తే చూసే కనులదే అసలైన పండగ. మహిళా దినోత్సవం రానున్న వేళ... అమ్మ, అమ్మాయి ధరించే డ్రెస్ కాంబినేషన్ల ‘ఎంపవర్మెంట్’ గురించి ప్రముఖ డిజైనర్ భార్గవి కూనమ్ చెబుతున్న ఆసక్తికరమైన విశేషాలు... మీ కోసం. తల్లీ-కూతురు ఒకేలా మ్యాచింగ్ డ్రెస్ ధరించడం విదేశాలలో ఎక్కువగా ఉంది. సందర్భం లేకపోయినా బయటికి వెళుతున్నారంటే చాలు ఇద్దరూ ఒకేలా వస్త్రధారణ చేసుకోవాలనే ఆసక్తి కనబరుస్తారు. ఈ తరహా డ్రెస్సింగ్ వల్ల నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ మన దగ్గరా నడుస్తోంది. ముఖ్యంగా ఇటీవల సంప్రదాయ వేడుకల్లో ఈ ట్రెండ్ చాలా పాపులర్ అయ్యింది. చాలాచోట్ల తల్లీకూతుళ్లు ఒకే కాంబినేషన్లో దుస్తులు ధరించి వేడుకలో వైవిధ్యంగా, ఆక ర్షణీయంగా వెలిగిపోతూ కనిపిస్తున్నారు. రంగుల ఎంపికే ప్రధానం వేడుకల్లో మహిళలు రెట్టింపు అందంతో మెరిసిపోవాలనుకుంటారు. అందుకే చాలా మంది విభిన్నమైన రంగుల కాంబినేషన్‌ని కోరుకుంటారు. వారి ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఒక డిజైనర్‌గా ఎక్కువ కాంతిమంతమైన రంగులను నేను ఎంచుకుంటాను. వాటిని బ్యాలెన్స్ చేస్తూ లేత రంగులను ఉపయోగిస్తాను. ఈ రెండురకాల ఫ్యాబ్రిక్‌ను కలుపుతూ ఎంబ్రాయిడరీపైన దృష్టిపెడతాను. హుందాతనం అమ్మ హుందాతనానికి ప్రతీక. కలర్‌ఫుల్‌గానే కాదు సింపుల్‌గా, స్మార్ట్‌గా కనిపించడం మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి. మంచి కాంతిమంతమైన రంగులు గల చీరలను ఎంచుకున్నప్పుడు వాటి మీదకు ధరించే ఆభరణాల ఎంపిక తక్కువ ఉండాలి. (పై ఫొటోలో రోజా, ఆమె కూతురు అన్షుల డ్రెస్సింగ్ కాంబినేషన్ ఒకేలా ఉన్నా కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఒక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. కూతురు బంగారు నగ వేసుకుంటే, రోజా సింపుల్‌గా కనిపించడానికి ముత్యాలు ధరించారు). సౌకర్యంగా ఉండాలి. పిల్లల డ్రెస్సులను రూపొందించడానికి ముందు అవి వారికి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా జాగ్రత్తపడాలి. ఒంటికి గుచ్చుకోని విధంగా ఆభరణాలు, మెత్తగా ఉండే ఫ్యాబ్రిక్‌తో డిజైనర్ దుస్తులు ఉండాలి. లేదంటే ఆ దుస్తులకు పిల్లలు దూరంగా ఉండే అవకాశం ఉంది. మెత్తటి క్రేప్, రా సిల్క్, బెనారస్ పట్టు, మల్ మల్ లైట్ వెయిట్ మెటీరియల్‌ను ఈ తరహా దుస్తుల డిజైన్‌కు ఎంపిక చేసుకోవాలి. అలాగే హెవీ వర్క్స్ లేకుండా కలర్స్పైనే ఎక్కువ దృష్టి పెడతాను. (ఇక్కడ రోజా ధరించిన చీరకు కుందన్స్‌తో డిజైన్ చేసిన బార్డర్ జత చేస్తే, ఆమె కూతురు ఓణీకి కడ్డీ అంచును జత చేశాం). ఏ డ్రెస్సింగ్ అయినా పిల్లలకు పెద్దగా మేకప్ అవసరం లేదు. కొద్దిగా హెయిర్‌స్టైల్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు అందంగా కనిపిస్తారు. వేడుకను బట్టి థీమ్... ఇప్పుడన్నింటా ఈ విధానమే కొనసాగుతోంది. పెళ్లికైతే వధువు-వరుడు ఒకే కలర్ కాంబినేషన్‌తో ఆకట్టుకునేలా ఉండటానికి డిజైన్ చేస్తాం. అదే పుట్టినరోజు, ఉయ్యాల వేడుక.. ఇలా పిల్లలతో ముడిపడి ఉన్న ఫంక్షన్లన్నీ ఒకే కలర్ కాంబినేషన్ అనేది ప్రధానాంశంగా నడుస్తోంది. కొన్నాళ్లుగా హాఫ్ శారీస్ (డిజైనర్ లంగా ఓణీలు) బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వేడుకలో కళను రెట్టింపు చేసేవాటిలో ఇవే ముందువరసలో ఉన్నాయి. అందుకే వేడుక అనగానే చాలామంది లంగా ఓణీలవైపే చూస్తున్నారు. కాబట్టి అమ్మాయిలకు డిజైనర్ లంగా ఓణీ ఎంపిక చేస్తే.. అదే తరహా రంగులతో ఆకట్టుకునేలా ఉన్న చీర అమ్మాయి అమ్మకు సరిగ్గా నప్పుతుంది. ప్రెజెంటేషన్: నిర్మలారెడ్డి భార్గవి కూనమ్