వెండి తెరపైకి బుల్లిరోజా? | Roja Selvamani's daughter debuts as child artist | Sakshi
Sakshi News home page

వెండి తెరపైకి బుల్లిరోజా?

Published Wed, Mar 11 2015 8:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

వెండి తెరపైకి బుల్లిరోజా?

వెండి తెరపైకి బుల్లిరోజా?

బుల్లి రోజా వెండి తెరపైకి రానున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళం, తెలుగు భాషల్లో 1990వ దశకంలో ప్రముఖ నాయకిగా వెలుగొందారు. ఈమె నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే తనను తమిళ తెరకు పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు ఆర్‌కె సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి గత శాసనసభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది ప్రజాసేవలో నిమగ్నమయ్యారు.
 
రోజా ఇటీవల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన కూతురు అన్షు మాళికతో కలసి ఉన్న ఫొటో ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమై పలువురిని విశేషంగా ఆకర్షించింది. దీంతో 12 ఏళ్ల అన్షు మాళికను సినిమాల్లో నటింప చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు మొదలెట్టారు. అన్షు మాళిక ఇప్పటికే బుల్లితెరపై బాలతారగా గుర్తింపు పొం దారు. దీంతో బాలతారగా ఆమెను పరిచయం చేయడానికి రోజా పచ్చజెండా ఊపినట్లు సమాచారం. కాబట్టి త్వరలోనే బుల్లి రోజాను వెండితెరపై చూడవచ్చన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement