చైతన్యపురి: ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని నెలలకే మొఖం చాటేసిన తన భర్తను తనకు అప్పగించాలని కోరుతూ ఓ యువతి అత్తింటి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. భరత్ అనే యువకుడు, బాధితురాలు రోజ సమీప బంధువులు. ప్రేమించుకున్న వారు 2016 లో కూకట్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే భరత్ రోజాను వేధించటం మొదలు పెట్టాడు.
మూడు నెలలుగా ఇం టికి రాకపోవడంతో బాధితురాలు గత నెల 19న సరూర్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే భరత్ కొత్తపేట లక్ష్మీనగర్‌లో నివసించే భరత్ తల్లిదండ్రుల ఇంటికి వచ్చి వెళ్తున్నట్లు రోజాకు సమాచారం అందడంతో సోమవారం సాయంత్రం ఆమె తన కుటుంబ సభ్యులు, మహి ళా సంఘాల నాయకులతో కలిసి లక్ష్మీనగర్‌లోని అత్తింటి వద్ద ఆందోళనకు దిగింది. కోర్టులో కేసు ఉండగా న్యూసెన్స్ చేస్తున్నారని భరత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రోజా ఆమె కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment