
ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ తీసిన 'వ్యూహం' సినిమా పార్ట్-1.. డిసెంబరు 29న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జరుగుతుండగా.. తాజాగా విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈవెంట్‌లో వైసీపీ మంత్రి రోజాతో పాటు మల్లాది విష్ణు, ఎంపీ నందిగం సురేశ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సినిమా గురించి సీఎం జగన్మోహనరెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ హిట్ మూవీ.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్)
'వ్యూహం' చిత్ర వ్యూహకర్త ఆర్జీవీకి అభినందనలు. బెజవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ ఆర్జీవీ. శివ నుంచి కంపెనీ వరకూ సినిమాలు తీసి, బెజవాడ నుంచి ముంబై వరకూ తన సత్తాను చూపిన వ్యక్తి వర్మ. ఆర్జీవీ అంటేనే ఒక సంచలనం. 'వ్యూహం' టైటిల్ ప్రకటించగానే సైకిల్ పార్టీ షేకైపోయింది. ఆర్జీవీ డైరెక్టర్ అనగానే పచ్చ పార్టీ నేతల ప్యాంట్లు తడిచిపోయాయి. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు జగన్ మోహన్ రెడ్డికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ 'వ్యూహం'. ఎందుకూ పనికిరాని పప్పు లోకేష్‌గాడు కూడా పవన్ సీఎంగా పనికిరాడని చెప్పాడు. రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి బాబుకి మద్దతు పలికి తనతో పాటు తన వర్గానికి పవన్ వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశాడు. ఎలాగైనా వ్యూహం సినిమాను ఆపాలనుకుంటున్నారు. అయితే 'వ్యూహం' చిత్రాన్ని ఆపలేరు, 2024లో జగనన్న విజయాన్ని కూడా ఆపలేరు' అని మంత్రి రోజా చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'వ్యూహం చిత్రానికి కర్తకర్మ క్రియలైన వర్మ, కిరణ్‌కు అంభినందనలు. రాజకీయాల్లో భయపడని వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సినిమాల్లో భయపడని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. 'వ్యూహం' విషయంలో చంద్రబాబు,లోకేష్ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు. ముంబై మాఫియాకే ఆర్జీవి భయపడలేదు...మీకు భయపడతారనుకుంటున్నారా?చంద్రబాబు కుట్రలు... పవన్ కమెడియన్ వేషాలను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రం రూపొందించారనుకుంటున్నాను. సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది' అని అన్నారు. ఇక పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. కచ్చితంగా సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఫైబర్ నెట్‌కు సినిమాను ఇస్తే పదిలక్షల మంది ఒకేసారి సినిమా చూపించే ప్రయత్నం చేస్తామని అన్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ సినిమా 'మంగళవారం'.. డేట్ ఫిక్స్)
Comments
Please login to add a commentAdd a comment