అమరావతి: జనసేన నేత పవన్ కల్యాన్‌పై మంత్రి రోజా సెటైర్లు వేశారు. పవన్ ముందు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్రయత్నించాలని సూచించారు. సీఎం జగన్‌ను ఓడించాలన్న అతని కల నెరవేరదని అన్నారు. బీపీ వచ్చినట్లు ఊరికే ఊగిపోతూ కేకలు వేస్తే ప్రయోజనం ఉండదని చెప్పారు. బై బై బీపీ అంటూ పవన్‌కు ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే ఓపిక, ప్రజలపై ప్రేమ ఉండాలని హితువు పలికారు.
లోకేశ్, పవన్ ముందు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో రాణించాలని సూచించారు. ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయి కాబట్టే వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తోందని చెప్పారు. గత ఎన్నికల్లో సీఎం జగన్‌ను ఓడిస్తానంటూ పవన్ మాట్లాడి, ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని అన్నారు.
ఇదీ చదవండి: ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన అప్‌డేట్స్..కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం జగన్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment