మా నోటీసులపై చర్యలేవీ? | No action on our notices? | Sakshi
Sakshi News home page

మా నోటీసులపై చర్యలేవీ?

Published Wed, Feb 24 2016 12:30 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

No action on our notices?

పివిలేజ్ కమిటీ మీటింగ్‌లో ప్రశ్నించిన వైఎస్సార్‌సీసీ సభ్యులు
ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని కమిటీ పనిచేస్తున్నట్లుగా ఉంది

హైదరాబాద్: తాము అందించిన నోటీసులు ఇంత వరకూ కమిటీ ముందుకు రాకపోవటంపై వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రివిలేజ్ కమిటీ ముందుకు రాకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ పనితీరు చూస్తే ఏకపక్షంగా, ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోందని, ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని వారు కోరారు. ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన కమిటీ సమావే శంలో సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, బీసీ జనార్ధనరెడ్డి పాల్గొన్నారు. తమ హక్కులను హరిస్తున్నారని వైఎస్సార్‌సీసీ సభ్యులు గత ఏడాది మార్చిలో ఏడు నోటీసులను అందించారు. అందులో ఒక్కటి కూడా ఇప్పటి వరకూ కమిటీ ముందుకు రాలేదు. ఇదే అంశాన్ని పెద్దిరెడ్డి, జ్యోతుల సమావేశంలో ప్రస్తావించారు. ఒక్క నోటీసు కూడా కమిటీ ముందుకు రాకపోవటం తమకు అనుమానాలు కలిగిస్తోందని, ఎందువల్ల ఇలా జరుగుతుందో వెంటనే తెలుసుకోవాల్సిందిగా ఛైర్మన్‌ను కోరారు.

తాము గతంలో అందచేసిన ప్రివిలేజ్ నోటీసుల కాపీలను ఛైర్మన్‌కు ఇచ్చారు. కమిటీ ముందుకు అవి రాకపోవటానికి దారి తీసిన కారణాలను తెలుసుకోవాల్సిందిగా కోరారు. కమిటీ పార్టీరహితంగా పని చేయాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. దీనిపై ఛైర్మన్ స్పందిస్తూ తాను సభ్యులు అందచేసిన కాపీలను అసెంబ్లీ సచివాలయానికి పంపి సమాచారం తెప్పించుకుంటానని చెప్పారు. ఇదే సమావేశంలో గత డిసెంబర్ 22న శీతాకాల సమావేశాల జీరో అవర్‌లో జరిగిన చర్చ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ నివేదికను ప్రివిలేజ్ కమిటీలో చర్చకు చేపట్టాల్సిందిగా అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె. సత్యనారాయణ అప్పటికపుడు ఎజెండాలో పెట్టేందుకు ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు నివేదిక ప్రతులు ఇవ్వకుండా చర్చించమంటే సాధ్యం కాదని, తమకు తొలుల నివేదిక అందిస్తే అధ్యయనం చేసి ఆ త రువాత చర్చిస్తామని చెప్పటంతో చివరకు ఛైర్మన్, ఇన్‌ఛార్జి కార్యదర్శి సరేనన్నారు. ఇదిలా ఉంటే కమిటీ మీటింగ్‌లో ఏడు నోటీసులపై చర్చ జరిగింది. ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన సభ్యులు వచ్చే నెల నాలుగో తేదీన హాజరై తమ వాదనలు వినిపించాల్సిందిగా కోరారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement