అసెంబ్లీ సవ్యంగా జరగాలంటే స్పీకర్, సభానాయకుడి మీద ఆధారపడి ఉంటుందని వైఎస్‌ఆర్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సభను నడుపుకోలేక ప్రతిపక్షాల మీద అభాండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సమావేశంలో చెప్పినట్లు వెల్లడించారు.